తెలంగాణ ముస్లిం సాహిత్యం తెలంగాణలో జాతీయోద్యమం-ముస్లింలు
ఆంధ్ర చరిత్రకారలు తెలంగాణ చరిత్రను విస్మరించినట్టుగానే ము స్లింలు చరిత్రనూ విస్మరించినారు. ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీ ప్రచురించిన చరిత్ర గ్రంథాల్లో భారత స్వాతంత్య్ర సంగ్రా మంలో పాల్గొని అసువులు బాసిన జైళ్ల పాలయిన ఏ తెలంగాణా ముస్లిం వీరుడి గురించీ రాయనేలేరు అంటే ఇతర చరిత్ర గ్రంథాల గురించి చెప్పాల్సినది లేదు. తెలంగాణ చరిత్రను వెలికి తీయడంలో భాగంగా జాతీయోద్యమంలో హైద్రాబాద్ ముస్లింలు పాత్రను గుర్తు చేసుకోవడం ఈ వ్యాస ఉద్దేశం. మెత్తం భారతదేశంలో జరిగిన జాతీయోద్యమంలో తెలంగాణ లేదా హైద్రాబాద్ జాతీయోద్యమం భాగమే అయిన ఇక్కడి జాతీ యోద్యమానికి స్థానిక కారణమూ ప్ర త్యేకతా పరిమితీ, నేపథ్యమూ ఉంది. ఈ దృష్టానే ఇక్కడి జాతీయో ద్యమానికి చూడాల్సి ఉంది. జా తీయ భావన పాశ్చాత్యులు తెచ్చిన ఆధునీకతతోపాటే భారత దేశంలోకొచ్చింది. అట్లా నిజాం రాజ్యం లోకి లేదా హైద్రాబాద్ రాజ్యంలోకి వచ్చింది.
నిజాం ఉల్‌ముల్క్ దక్కన్ సుబేదార్ అయిన తార్వాత ఆయన ను ప్రసన్నం చేసుకోవడానికి ఫ్రెంచి, బ్రిటీష్ విళ్లిద్దరు ఎన్నో కానుక లు సమర్పిసంచుకోవడంతో హైద్రాబాద్ రాజ్యంతో పాశ్చాత్య సంబంధం మొదలైంది. ఫ్రెంచివారు ఆక్రమించిన తమ మద్రాసును తమకు ఇప్పించమని కోరుతూ క్రీ.శ 1746లో ఇంగ్లీషు ప్రతినిధి గ్రిఫిన్ నిజాంకు ఉత్తరం రాయడంతో దారి పడి క్రమంగా 1759 లో జరిగిన ఒప్పందంలో 12.10.1800న జరిగిన సైనిక సహాకార ఒప్పందంతో బ్రిటీష్‌వారు నైజాం రాజ్యంలో పై చేయి సాధించారు. వాళ్లు ఇక్కడ కాలనీలు స్థాపించుకొవడం, విద్యాసంస్థల్ని స్థాపించ డం మొదలైన కార్యక్రమాలతో ఆధునీకత లేదా పాశ్చాత్వీకరణ వ్యాపించింది. దీంతో పాటుగానే బ్రిటీష్ వ్యతిరేక భావన కూడా మొదలైంది. ఈ బ్రిటీష్ వ్యతిరేక భావనతో అనేకమంది ముందుకు సాగిన ముస్లింల పాత్రకే ఈ వ్యాసం పరిమితం.
పై ఒప్పందంతో సబ్సిబరీ దళాల్లో అసంతృప్తి మొదలైంది. నూర్‌ఉలూమ్ కార్యకలాపాలు అందులో భాగమే. ఆధునితా స్వీకర ణ, జాతీయోద్యమం పక్కపక్కనే ఒకదాన్నోకటీ ప్రభావితం చేసుకుం టూ సాగినయి కనుక ఆధునీకతను ఆహ్వానించిన ముస్లింలను కూ డా జాతీయోద్యమంలో భాగంగానే చూడాలి. అట్లా చూసినప్పుడు ఆధునీతను స్కీరించిన మొదటి ముస్లిం వైతాళీకుడు షామ్స్ ఉల్ ఉమ్రా. ఆయన 1829లో మదరసా శాస్త్రాల వంటి వాటిని బోధిం పింప చేసేవాడు. ప్రపంచ జ్ఞానాన్ని అనువదింపచేయడానికి 1843 లో ట్రాన్సిలేషన్ బ్యూరోనూ, ప్రెస్‌ను ప్రశ్రీనారంభించి ఉర్దూ పర్షి యన్ భాషల్లో వైద్య ఇంజనీరింగ్ మొదలైన వాటికి సంబందించిన 50 గ్రాంథాలను ప్రచురించాడు. ఇట్లా హైద్రాబాద్ రాజ్యంలో ఆధు నిక విద్యావ్యాప్తికి ఇతడే మూలం.పైన్నే చెప్పుకున్నట్లు ఆధునిక వ్యాప్తితో పాటు బ్రిటీష్ వారి పట్ల అయిష్టత పెరిగింది. ప్రముఖ చరి త్రకారుడు పి.శ్రీనివాస్‌చారి అన్నట్లు బ్రిటీష్‌వారితో నిజాం పొత్తు అటు నిజాంకి గానీ ఇటు ప్రజలకు గానీ ఇష్టం లేదు. మహీపతిరా మ్ పథకం ముబారిజ్ ఉద్దౌలా నాయకత్వంలోని వహాబీ ఉద్యమం ఈ అయిష్టత ఫలితమే
భారత తొలి స్వాతంత్య్ర సమరం-వహాబీ ఉద్యమం:
ముబారిజ్ ఉద్దౌలా:
ఉత్తర భారతదేశంలో ముస్లింలలో ాసాంఘీక సంస్కరణను తీసుకురావటానికి వారి రాజకీయ ప్రమోజనాల సాధించడానికి ప్రా రంభమైన గొప్ప ఉద్యమం వహాబీ ఉద్యమం క్రమంగా అది పంజా బ్‌లో సిక్కుల ప్రభుత్వం మొత్తం దేశంలో ఇంగ్లీషు ప్రభుత్వం పోవా లనే లక్ష్యాలుగా నడిచింది. అక్కడ దీన్ని ప్రారంభించినవాడు సయ్య ద్ అహ్మద్ బ్రయిల్వీ 1820ల నాటికే ఈ ఉద్యమం బెంగాల్ నుంచి దేశంలోని మిగతా ప్రాంతాలకు పాకింది. 1831 లో ఆయన చని పోయినప్పటికీ ఉద్యమం ఆగలేదు. ఆయన అనుచరులు మౌల్వివి లాయత్ ఆలీ సలీంలు 1838 లో ఈ ఉద్యమాన్ని దక్కన్‌కు తీసుకొ చ్చారు. హైద్రాబాద్‌లో ఈ ఉద్యమానికి ముబారిజ్ ఉద్దౌలా కేంద్ర బిందువుగా తమ్ముడు. ఇతణ్ని దేశ బహిష్కారం చేయకపోతే ఇరవై వుల మంది వహాబీ ఉద్యమకారుల్ని ఎదుర్కోవడం కష్టమవుతందని బ్రిటీష్ రెసిడెంట్ అనడాన్ని బట్టి ఈ ఉద్యమ తీవ్రత అర్థమవు తుంది. అయితే ఇతణ్ని బహిస్కరించకుండా అరెస్ట్ చేసి కోటలో బందించినారు. దీన్ని బట్టి ఇతణ్ని తెలంగాణలో తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా భావించవచ్చు తెలంగాణలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం లేదనేవారికి ఇది ఒక సమాధానం. నిజానికి 1857 సిపా యిల తిరుగుబాటుకు దీనిని నాందీ వాచకంగా భావించవచ్చు.
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో రాయలసీమ కోస్తాంధ్రలు మౌనంగా ఉండిపోగా హైద్రాబాద్ అట్టుడికిపోయింది. ఈ అటజడికి సిపాయి తిరుగుబాటు ప్రభావంతో పాటు 1800 ల నుంచి రగులుతున్న బ్రిటిష్ వ్యతిరేకత 1853 లో బీరార్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వారు కౌవసం చేసుకోవడం వహాబీ ఉద్యమ నాయకుడు ముబారిజ్ ఉద్దౌలా 1854 లో జైలులోనే చనిపోవడం, ఒక క్రిష్టియ న్ ముస్లిం ఇస్లాంని విమర్శించినందువల్ల బొల్లారం కాంటిజెంట్ సైన్యంలో 1855 లో అలజడి చెలరేగి బ్రిగేడియర్ మెకంజా మీద దాడి జరగడం ఇవన్నీ కారణాలే.
ఢిల్లీలో పెల్లుబికిన యుద్ద వార్తలు హైద్రాబాద్‌లో గొప్ప ఉద్వేగా న్ని సృష్టృంచింది. దీనికి తోడు జమేదార్ చీదాఖాన్ సిపాయిలతో హైద్రాబాద్‌లో అడుగుపెట్టగానే అరెస్ట్ చేయడం మరింత ఉద్రిక్తతకు కారణమయింది. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల ని నిజాంను డిమాండ్ చేస్తూ మసీదుల మీద నినాదాలు వెలిసినవి. ప్రవక్త మీకు అండగా ఉంటాడు భయపడొద్దు భయపడితే గాజులు తొడుక్కుని ఇంట్లో కూచో అని నినదించారు. మక్కామసిదులో గూ మికూడిన ప్రజలు చీదాఖాన్‌ని అతని అనుయయూల్ని వెంటే విడు దల చేయాలని డిమాండ్ చేశారు. నిజాం అందుకు తిరస్కరించడం తో జమేదార్ తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లా ఉద్దీన్ నాయకత్వంలో 500 మంది రోహిల్లాలు కోఠి మీద 17.7.1857 న దాడి చేసి నారు. ఈ దాడిలో వీళ్లు వీరోచితంగా తెల్లవారు జామున నాలుగు గంటల వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. అతి కష్టం మీద తుర్రే బాజ్ ఖాన్‌ను అరెస్టు చేశారు.అనంతరంజరిగిన విచారణలో తుర్రే బాజ్‌ఖాన్ ఉదాత్తంగా ధీమంతంగా జవాబులిచ్చానాడు. రెసిడెన్సి మీద దాడికి నేనే పూర్తి బాద్యుణ్ని అని, తన అనునయుయి బుద్దాఖా న్‌తో సహా ఏ రోహిల్లాలు తనను అనుసరించలేదని, మౌల్వి అల్లా ఉద్దీన్‌తో కలిసి దాడి నిర్వహించలేదుని అసలతనేవరో తనకు తెలు వదనీ దాడి బాధ్యతను మొత్తం తన మీదే వేసుకున్నాడు. బ్రిటిష్ వాళ్లను భారతదేశం నుంచి తరిమివేయడానికి మత విశ్వాసంతో తిరుగుబాటు చేశానని దృఢంగా ప్రకటించినాడు. అనంతరం అతనికి జీవిత శిక్ష వేయడం జైలు నుంచి తప్పించుకోవడం తిరిగి పట్టుబడడం బ్రిటిష్ సైనికులు అతణ్ని దారుణంగా కాల్చి చంపి శవాన్ని సంకెళ్లతో బహిరంగ స్థలంలో వేలాడదీయడం హైద్రాబాద్ ప్రజల్ని కలచివేసింది. ఖాన్‌తో పాటు కోఠి మీద దాడి చేసిన మరో వీరుడు సూఫీ తత్వవేత్త మత ప్రచారకుడు ఆయిన మౌల్వి అల్లా ఉద్దీన్ తప్పించుకునిపోగా అరెస్టు చేసి జీవితఖైదు శిక్ష విధించి 28.7.1859 న అండమాన్ జైలుకు తరలించినారు. దేశ స్వాతంత్య్రం కోసం 25 ఏళ్లు ఆ జైల్లోనే మగ్గి 1884లో మరిణించాడు.
డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
ఇంకావుంది…