తెలంగాణ రాష్ట్రం లో ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని అమలు చెయ్యాలి.

బీజేపీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రాంచందర్ రావు
కొత్తగూడ జూలై   జనంసాక్షి:కొత్తగూడ మండల కేంద్రం లో ఫసల్ భీమా పథకాన్ని అమలు చెయ్యాలని బిజెపి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పధకాన్ని తెలంగాణ రాష్ట్రం లో అమలు చెయ్యాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రాంచందర్ రావు డిమాండ్ చేశారు.అతివృష్టి వల్ల కానీ అన్నావృష్టి కానీ పంటలు దెబ్బతిన్నప్పుడు రైతన్నలకు ఉపయోగ పడే ఫసల్ భీమా (పంట భీమ )పధకాన్ని తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ ప్రభుత్వం అమలు చెయ్యకపోవడంతో ఇలాంటి విపత్కర పరిస్థితిలో రైతులు ఆర్థికంగా నష్ట పోయి ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని అన్నారు.రైతులను కెసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఇప్పటికైనా కెసిఆర్ కి రైతులపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం లో ప్రధాన మంత్రి ఫసల్ భీమా (పంటల భీమా )పథకాన్ని అమలు చెయ్యాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య మాట్లాడుతు రైతులకు ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం ఓకే సారి లక్ష రూపాయల రుణ మాఫీ లేని చెయ్యాలని,రాష్ట్రం లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడ్డ రైతులను ఆడుకోవాలని అన్నారు.లేని యెడల బీజేపీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని హేచ్చరించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు వాసం మునిందర్,బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ.నవీన్ నాయక్,బీజేపీ జిల్లా కార్యదర్శి భూపతి తిరుపతి,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి.గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసం నరేష్,మురళి,బీజేవైఎం జిల్లా కార్యదర్శి వజ్జ రవి,మండల కోశాధికారి తుపాకుల పరుశురాం,మండల ఉపాధ్యక్షుడు సిరబోయిన యాకయ్య,బూత్ అధ్యక్షులు బిక్షపతి,నాయకులు రవీందర్,మధు తదితరులు పాల్గొన్నారు.
Attachments area