తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22 అమలు చేయాలి: జే ఏ సి

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 10 (జనం సాక్షి): మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి వినతి పత్రం అందచేశారు. శనివారం జెఏసి నాయకులు కూనవరం గేట్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని సింగరేణి కాంటాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవో 22 గెజిట్ విడుదల చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెంపు వర్తింపజేయాలని సొంత ఇంటి పథకానికి కాంట్రాక్ట్ కార్మికులకు మూడు లక్షల రూపాయల ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. తెలంగాణలోని షెడ్యూల్డ్ ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనములు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 30.6.2021 , నెంబర్ 22 జీవోను విడుదల చేసిందనీ. ఈ. జి ఓ ప్రకారం సింగరేణిలో పనిచేస్తున్న అన్నివిభాగాల కాంట్రాక్టు కార్మికులకు అమలుచేస్తే కాంట్రాక్టు కార్మికులకు మేలు జరుగుతుందని,.ప్రస్తుతం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ఓబీ వర్కర్లకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు చెల్లిస్తున్న వేతనాలు వారి కుటుంబాలు గడిచేలా లేవనీ.అప్పులు,అర్దాకలితో కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు చీకటిలో బతుకుతూ ఇబ్బంది పడుతున్నారనీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 22 ప్రకారం వేతనాలు చెల్లించడం వల్ల 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు కొంత ఉపశమనం కలుగుతుందని అన్నారు. జి ఓ ఎం ఎస్ నెంబర్ 22 గెజిట్ విడుదల చేయకపోవడం వల్ల సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అన్ స్కీల్డ్ కార్మికులు రూ.8000 .లు, సెమి స్కీల్డ్ కార్మికులు రూ.9900లు,స్కిల్ కార్మికులు రూ.1024 లు,హైలీ స్కిల్ కార్మికులు 11 నుండి 24 వేల వరకు ప్రతినెలా నష్టపోతున్నారనీ. దీంతోపాటు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎక్కువమంది కాంటాక్ట్ కార్మికులకు సొంత ఇల్లు కూడా లేని దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారని వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని, సింగరేణి కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోవాలని దీనికై ప్రభుత్వ విప్, రేగా కాంతారావు కృషి చేయాలని జేఏసీ నాయకులు అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా మణుగూరులోని అన్ని విభాగాల కాంటాక్ట్ కార్మికులు రెండవ రోజు కూడా సమ్మెలో పాల్గొన్నందుకు వారికి జేఏసీ నాయకులు విప్లవ జేజేలు పలికారు సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందని సింగరేణి సంస్థ ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని వారు కోరారు, సింగరేణి పర్మినెంట్ కార్మిక సంఘాలు కూడా తమ సమ్మెకు సంఘీభావం ప్రకటించాలని సమస్య పరిష్కారానికి యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని జేఏసీ నాయకులు కోరారు,ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కన్వీనర్ మిడిదొడ్ల నాగేశ్వరరావు, గద్దల శ్రీనివాసరావు, ఆర్ మధుసూదన్ రెడ్డి, అక్కి నరసింహారావు, వెలగ పల్లి జాన్, గౌని నాగేశ్వరరావు, అంగోత్ మంగీలాల్, ఎండి గౌస్, ఉప్పు తల నరసింహారావు, సంజీవ్, మంగి వీరయ్య, ఎస్కే సర్వర్, పూసల భద్రం,మలికంటి రాము, కాంట్రాక్ట్ కార్మికులు కే రవి, భాష, బత్తుల లక్ష్మణ్, ప్రసాద్, ఉప్పయ్య,మాలోత్ రవి, హాథిరాం, సారయ్య, కస్న, భీమరాజు,యాదగిరి, నివాస్, వెంకటేశ్వర్లు, ఎల్లమ్మ,ఫాతిమా, ఇమామ్ బీ, గట్టమ్మ, ఆదిలక్ష్మి , రుక్మిణి, వెంకటరమణ ,కొమరమ్మ, మంగ ,అనసూర్య, సూరమ్మ, సరోజిని,అరుణ స్వరూప తదితరులు పాల్గొన్నారు.