తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శం. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

కోటగిరి అక్టోబర్ 21 జనం సాక్షి:-ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు స్వంత ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో సీఎం కెసిఆర్ 100 శాతం సబ్సిడీతో డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.కోటగిరి మండలంలోని దేవుని గుట్ట తాండ,కొత్తపల్లి గ్రామాలలో శుక్రవారం రోజున డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ,పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు స్పీకర్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొటగిరి మండలంలో నూతనంగా నిర్మించుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకు సంబందించిన సుమారు ఏడు కోట్ల రూపాయల చెక్కులను పంపిణి చేయడం జరిగింద ని,దీపావళి తరువాత మళ్ళీ14 కోట్ల రూపాయలు బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. రాష్టంలో నే పది వేల ఇండ్ల మంజూరు చేసుకొని నిర్మించుకుంటున్న ఘనత మనకే దక్కుతుందని ఆయన అన్నారు.13 డిసెంబర్ 2005 వరకు వరైతే గిరిజనులు అటవీ శాఖ భూమిలలో కబ్జా ఉన్నారో వారికీ పట్టాలను త్వరలో మంజూరు చేస్తామన్నారు.రైతులు ఎవ్వరు కూడా తక్కువ ధరకు ధాన్యంని అమ్ము కోవద్దని,రేపటి నుండే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్,
జెడ్పీటీసీ శంకర్ పటేల్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్,స్థానిక సర్పంచ్ శాంతబాయి,ఆర్డీఓ రాజేశ్వర్,బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్,హౌసింగ్ డిఈ నాగేశ్వర్ రావు,మండల ప్రజా ప్రతినిధులు ,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area