తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
చేవెళ్ల సెప్టెంబర్10(జనంసాక్షి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు సున్నపు వసంతం డిసిసి మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్ స్వామి పిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి లు పిలుపునిచ్చారు.
చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి సందర్భంగా చేవెల్ల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నిలవెత్తు విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దీరవనిత అని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి యాలాల మహేశ్వర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చేవెళ్ల ఎంపీటీసీ సభ్యుడు గుండాల రాములు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పాండు యాదవ్, చేవెళ్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సుశాంత్, రంగారెడ్డి జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ అనీఫ్, మండల పార్టీ కార్యదర్శి మహమ్మద్ ఖదీర్, మైనారిటీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఫరూక్ , చేవెళ్ల మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మాణిక్యం, చేవెల్ల గ్రామ ఉపసర్పంచ్ గంగి యాదయ్య, ఉరెళ్ళ దేవేందర్, కే సత్యనారాయణ, పలుగుట్ట శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.