తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

జగిత్యాల రూరల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 27

పండుగ వాతావరణం లో బతుకమ్మ చీరల పంపిణీ, బతుకమ్మ చీరలతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగు, తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చిరుకానుక బతుకమ్మ చీరలని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకార్యక్రమంలో భాగంగా,ఈ రోజు జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల మరియు బాలపెల్లి
గ్రామపంచాయతీ ఆవరణలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతికగా నిలిచే బతకమ్మ పండుగ రోజున రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగ నిర్వహించుకోవాలని సంబంధిత లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ 2017లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు.
నాటినుండి నేటి వరకు ప్రతి సంవత్సరం వినూత్న రంగులతో సరికొత్త జరి అంచులతో నాణ్యమైన చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రత కార్డుల ద్వారా మహిళలందరికి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.బతుకమ్మ చీరల తయారీని సైతం నేతన్నలకు అందించి వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కరాధ,పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,రైతు బంధు కన్వీనర్ నక్క రవీందర్ రెడ్డి,సర్పంచ్లు సంధ్యా రాణి,భూపతి రెడ్డి,ఎంపీటీసీలు సౌజన్య తిరుపతి,రవి,ఉప సర్పంచ్ గంగారెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు అరే రవి,ఎంపిడిఒ రాజేశ్వరి,ఎంపీఓ రవిబాబు,ఐకేపీ ఎపీఎం గంగాధర్, అధికారులు,నాయకులు పడిగేల గంగారెడ్డి,దుంపల కరుణాకర్ రెడ్డి, నాగి రెడ్డి గంగారెడ్డి,భూమరెడ్డి,తోట మహేష్,మల్లేశం, చందు, శేఖర్,జగన్,శశికుమార్,చిరంజీవి,
సంజీవ్,రమేష్,మల్లేష్,ప్రజాప్రతినిధలు తదితరులు పాల్గొన్నారు.