తెలంగాణ సర్కారు ప్రజల మన్నన పొందింది

5

– ప్రపంచానికి విశ్వాసం పెరిగింది

– పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌

డల్లాస్‌్‌,మే 11 (జనంసాక్షి):  తెలంగాణ సర్కర్‌ ప్రజల మన్నలను పోందడంతో ప్రపంచానికి విశ్వాసం పెరిగిందనితెలంగాణ ఐటి ,పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు తన అమెరికా పర్యటనలో భాగంగా అయిదో రోజు డల్లాస్‌ లోని పలు కార్యక్రమాల్లో పాల్గోన్నారు. వైబ్రంట్‌ హైదరాబాద్‌ – సియివో  కనెక్ట్‌ కార్యక్రమంతో పాటు డల్లాస్‌ లోని ఏన్నారైలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ ప్రభుత్వం పాలసిలో భారీ పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక దిగ్గజాలకి అవసరమైన రాయితీలను ప్రత్యేకంగా అందించేందుకు అవకాశమున్నదని, అలాంటి పెట్టుబడి దారులకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందు సిద్దమని తెలిపారు.

భారీ పెట్టుబడులతో ముందుకు వస్తే భారీ ప్రాజెక్టులకి వారితోనే చర్చించి అవసమైన రాయితీలు ఇచ్చేందుకు సిధ్దంగా ఉన్నామని హవిూ ఇచ్చారు. ప్రభుత్వ పాలసీతో పాటు అవసరమైనంత నీరు, పవర్‌, కావాల్సినంత ప్రభుత్వ ల్యాండ్‌ బ్యాంకు ఉన్న ఏకైకరాష్ట్రం తెలంగాణ కాబట్టి పెట్టుబడులకి ముందుకు రావాలని కోరారు.

ఏన్నారైలతో ప్రత్యేక సమావేశంలో మంత్రి డల్లాస్‌ నగరంలో  శనివారం ఉదయం జరిగిన ఏన్నారైల తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాన్ని డల్లాస్‌ ఏరియా తెలంగాణ అషోషియేషన్‌ ఏర్పాటు చేసింది. వీరిరితో పాటు మంత్రిని ఏన్నారై టియారెస్‌ నాయకులు కార్యకర్తలు కలసిసారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏన్నడూ లేని విధంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని, ఈ కార్యక్రమాలను విజవంతం చేసి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు కళలు కంటునన్‌ బంగారు తెలంగాణ జరుగుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.  ముఖ్యంగా తెలంగాణ డ్రికింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు దేశలో ఇతర రాష్ట్రాలు అద్యయనం చేయాలని, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన ఈ పథకం పూర్తయితే దేశానికే అదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు భారీగా పెరగుతాయన్నారు. ప్రతి తెలంగాణ ఏన్నారై హైదరాబాద్‌ ని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాలని, ముఖ్యంగా తెలంగాణ అనే కొత్త రాష్ట్రంలో జరుగుతున్న అద్బుతమై ప్రగతిని,అవకాశాలను విడమర్చి చేప్పాలని పిలుపునిచ్చారు.

కేవలం పధకాలు భారీ ఏత్తున చేపట్టడమే కాకుండా , అయా పథకాల నిర్వహన, అమల్లోనూ ప్రజల పన్నులను ఖర్చు చేసేందుకు అత్యుత్తమ పారదర్శక పద్దతులును అమలు చేస్తున్నమని తెలిపారు.   ప్రజల పన్నులు ప్రజలకే చేరుతాయాన్న సానకూల మేసేజ్‌ ని ప్రజలకి చేర్చి వారిలో విశ్వాసం నింపేలా నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటి గ్రావిూణ ప్రాంత ప్రజలు సైతం తమ ప్రయత్నాన్ని అభినందిస్తు గతంలో కంటే సూమారు 40 నుంచి 60 అధికంగా పన్నుల చెల్లిస్తున్నారని తెలిపారు.  తెలంగాణ ప్రజలకోసం, తెలంగాణ పునర్మిణాం కోసం ఏన్నారైలు కలసి రావాలని కోరారు.

వైబ్రంట్‌ హైదరాబాద్‌- సియివో కనెక్ట్‌ సమావేశంలో మంత్రి కె.తారకరామా రావు

కంపెనీల సియివోల సదస్సులో పాల్గోన్న మంత్రి కె.తారకరామారావు  నూతన పారిశ్రామ విధానం గురించి పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ఇచ్చారు. ఇప్పటి , ఏప్పటికి హైదరాబాద్‌ నగరం వ్యాపార కేంద్రంగా పరిఢవిల్లుతుందన్న హవిూని ఇచ్చారు. చారిత్రకంగా ఉన్న హైదరాబాద్‌ చార్మింగ్‌ తోపాటు నూతన ప్రపంచపు అదునాతన పోకడలను నిత్యం అందింపుచ్చుకుంటుందన్నారు. తమ ముఖ్యమంత్రి డల్లాస్‌ నగరాన్ని ఓక అధర్శనగరంగా భావిస్తారని, డల్లాస్‌ నగరంలా హైదరాబాద్‌ ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం పలు ప్రణాళికలు వేస్తున్నదన్నరు.

ఈ వైబ్రంట్‌ హైదరాబాద్‌ సియివో కనెక్ట్‌ కార్యక్రమంలో మంత్రి కె.తారక రామారావు తోపాటు ఐటి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌  పాల్గోన్నారు.

భీకర మంచు తుఫాన్‌ లో మంత్రి సాహసోపేత ప్రయాణం

పెట్టుబడులు, నూతన తెలంగాణ రాష్ట్రం గుడ్‌ విల్‌ ని విశ్వవ్యాప్తం చేసేందుకు అమెరికాలో బిజిబిజిగా గడుతుపుతున్న మంత్రి మరో సాహసోపేతంగా వ్యవహరించారు. శనివారం సాయంత్రం డల్లాస్‌ నుంచి శాన్‌ ప్రాన్సిస్కో బయలు  విమానంలో దేరాల్సిన మంత్రి, డల్లాస్‌ లో కురుస్తున్న భారీ హిమపాతం, కుండపోత వర్షం  దష్ట్క్యా డల్లాస్‌ విమానాశ్రాయం నుంచి పూర్తిగా విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో డల్లాస్‌ లోని అధికారులు, ఏన్నారైలు రేపటి కార్యక్రమ రద్దు చేసుకోవాలని, ఈ పరిస్ధుతుల్లో ప్రయాణం ప్రమాధకరమని వారించినా వినకుండా ,శాన్‌ ప్రాన్సికోలో కీలక మైన సమావేశాలున్నందున బయలు దేరాల్సిందేనని , కుండపోత వర్షంలో మంత్రి తన నలుగురు సభ్యుల బృందంతో ప్రమాదకపరిస్థితుల్లో వ్యాన్లో రోడ్డు  ద్వారా నాలుగుగంటలు ప్రయానించి అర్ధరాత్రి అస్టిన్‌ నగరాన్ని చేరుకున్నారు. విమానం రద్దు కావడంలో మంత్రి ఇలా రోడ్డు ద్వారా ప్రయాణం చేసారు.  ఇక్కడనుంచి నేరుగా శాన్‌ ప్రాన్సిస్కో కి అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం చేరుకుంటారు.