తెలంగాణ సాధనకు యాచించం.. కేంద్రాన్ని శాసిస్తాం

– టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) :

తెలంగాణ సాధనకు ఇకపై ఎవరినీ యాచించబోమని, కేంద్రాన్ని శాసించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు  అన్నారు. నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నేతల కుట్రలు, కుతంత్రాలను విచ్ఛిన్నం చేసి తెలంగాణ సాధించుకుందా మని, ఎవరూ కలత చెందవద్దని సూచించారు. జగన్‌ సీఎం అయితే రెండేళ్లలో పోలవరం కడుతామని విజయమ్మ చెబుతోంది. ఆయన ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నోట్లో మట్టే. వలస వాదుల పాలనలో తెలంగాణ ఇప్పటికే దగా పడింది. ఈ నెల 28న అఖిల పక్షం సందర్భంగా జగన్‌, చంద్రబాబు అసలు రంగు బయట పడుతదని అన్నారు. అఖిల పక్షం సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని పార్టీలను తరిమికొడుతామని తెలంగాణ సాధనకు ఇకపై ఎవరినీ యాచించబోమని, కేంద్రాన్ని శాసించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు  అన్నారు. నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నేతల కుట్రలు, కుతంత్రాలను విచ్ఛిన్నం చేసి తెలంగాణ సాధించుకుందామని, ఎవరూ కలత చెందవద్దని సూచించారు. జగన్‌ సీఎం అయితే రెండేళ్లలో పోలవరం కడుతామని విజయమ్మ చెబుతోంది. ఆయన ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నోట్లో మట్టే. వలస వాదుల పాలనలో తెలంగాణ ఇప్పటికే దగా పడింది. ఈ నెల 28న అఖిల పక్షం సందర్భంగా జగన్‌, చంద్రబాబు అసలు రంగు బయట పడుతదని అన్నారు. అఖిల పక్షం సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని పార్టీలను తరిమికొడుతామని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దోచుకునేందుకే ఆంధ్రోళ్లు తెంగాణను అడ్డుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే, రాష్ట్ర బడ్జెట్‌ 85 వేల కోట్లు ఉంటుందని, ఆ బడ్జెట్‌తో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎంపీలను గెలిపించుకుని సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. 2001లో అప్పుడే పుట్టిన టీఆర్‌ఎస్‌కు జిల్లా పరిషత్‌ను గెలిపించింది నిజామాబాద్‌ జిల్లా అని కొనియడారు. ఈ ప్రాంతంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీలను బ్యాన్‌ చేయాలన్నారు. తిమ్మిని బమ్మిని చేసిన చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నాడు. నక్క జిత్తుల చంద్రబాబును ప్రజలు నమ్మరని తెలిపారు. నిజాం ఫ్యాక్టరీ అమ్మిందెవరో ప్రజలు తెలుసుకోవాలన్నారు. సింగూరు నీళ్లు నిజామాబాద్‌కు రావాలంటే తెలంగాణ రావాల్సిందేనని తెలిపారు.