తెలంగాణ ‘స్థానిక’ ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేత
` హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్‌ఈసీ ప్రకటన
హైదరాబాద్(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్లు తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ ఇచ్చేవరకు ఎన్నికల ప్రక్రియలన్నీ నిలిపివేసినట్లు ప్రకటించింది.