తెలుగు మహాసభలను బహిష్కరించడి :చుక్కా రామయ్య

వరంగల్‌: ప్రభుత్వం డిసెంబర్‌ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరుపతలపెట్టిన తెలుగు మహాసభలను బహిష్కరించాలని విద్యావెత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలను, భాషా సంస్కృతులను ధ్వసం చేస్తున్న పాలకులు ఈ మహాసభలు నిర్వహించడం దుర్మార్గం అన్నారు. తెలుగు మహాసభలను తెలంగాణ కవులు, కళాకారులు వ్యతిరేకించాలన్నారు.

రచయితలను నిర్భందిస్తూ, ప్రజా ఉద్యమాల్లోని రచయితలను, కళాకారులను హత్యలు చేస్తూ, సాహిత్య సంస్థల నషేధం దాక వెళ్ళిపోయిన ప్రభుత్వాలు కోట్ల  రూపాయలతో ఈ మహాసభలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు. మరో పక్క కాకతీయ ఉత్సవాలకు  నిధులు కేటాయించక పోవడం తెలంగాణ పట్ల వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది విద్యార్థులు చనిపోయి క్షోభ అనుభవిస్తుంటే మహాసభల పేరుతో పండుగచేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు.