తొత్తు యూనియన్లకు బుద్ధి చెప్పాలి
టవర్‌సర్కిల్, జనంసాక్షి: బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న యూనియన్లకు ఓటుతో తగిన బుద్ధిచెప్పాలని బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయూస్ ఎన్నికల కోసం జీఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎంప్లాయూస్ యూనియన్ నాలుగుపార్లు గుర్తింపు సంఘంగా గెలిచిందన్నారు. ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ, ప్రమోషన్ పాలసీ ఇప్పించి ఉద్యోగులకు మేలు చేసిందని చెప్పారు. ఎస్‌ఎఫ్‌టీఈ యూనియస్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ వీఆర్‌ఎస్‌ను అమలు చేయించి ఉద్యోగులకు నష్టం చేసేందుకు సమాయత్తమవుతోందని విమర్శించారు. సంస్థను, ఉద్యోగులను కాపాడే యూనియన్‌కు ఓటువేయాలని కోరారు. జిల్లాలో 660 మంది సభ్యులుండగా.. ఎంప్లాయూస్ యూనియన్‌కు 417 మంది సభ్యత్వముందన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి విజయ్, కిషన్, యాకూబ్‌పాషా, ఎం, రాజు , ఎన్, సుశీల, పి, మురళి సుధాకర్, రామస్వామి , గంగారాం, శ్రీనివాసమూర్తి , చంద్రమౌళి, రవీందర్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.