తొమ్మిదేళ్లలో బాబు చేసింది శూన్యం

ఆయన అబద్ధాల స్పెషలిస్ట్‌
పేదల అభివృద్ధే కాంగ్రెస్‌ లక్ష్యం : సీఎం
చిత్తూరు, మే 27 (జనంసాక్షి) :
తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన అబద్ధాలు ఆడటంతో స్పెషలిస్ట్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల నిధులను సక్రమంగా వినియోగించేలా సబ్‌ప్లాన్‌ను తీసుకువచ్చి చట్టబద్ధం చేశామని, త్వరలోనే బంగారు తల్లి పథకానికి కూడా చట్టబద్దత తెస్తామని కిరణ్‌ ప్రకటించారు. సొంత నియోజకవర్గమైన పీలేరులో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పీలేరు నియోజకవర్గంలో ఏదో మహత్యం ఉందని, అంతకు ముందు తాను కనీసం మంత్రిని కాలేక పోయానని, పీలేరులో గెలిచాక ఏకంగా ముఖ్యమంత్రినే అయ్యానన్నారు. పీలేరులో ఆయన పలు అభివృద్దిపనులకు సిఎం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకులకంటే, పార్టీలకంటే ప్రజలు నిజమైన తెలివిగల వారని బాబుకు తెలియడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అబద్దాలతోనే కాలం గడుపడం అలవాటైందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను కడుగుకోవడానికే బాబు పాదయాత్ర చేశారని ఎద్దేవా చేశారు. సిఎంగా తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నా బాబు చిత్తూరు జిల్లాకు ఒరగబెట్టిందేవిూ లేదన్నారు.  ప్రేమలు ఒలుక పోయడం కాంగ్రెస్‌కుగాని తనకుగాని రాదని, ఇచ్చినమాటలను తు.చ తప్పకుండా అమలుచేయడమే మా ప్రత్యేకతన్నారు. నిత్యం అసత్యాలు చెపుతూ కాలం వెల్లదీయడం బాబుకు అలవాటై పోయిందన్నారు. చింత సచ్చినా పులుపు చావదన్న సామెత బాబుకు నూటికి నూరుశాతం వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో మరోసారి పాదయాత్ర చేసినా కూడా చంద్రబాబు అధికారంలోకి రాలేడన్నారు.  చంద్రబాబు 9 ఏళ్లపాలనలో ఏఒక్కరోజు కూడా రైతు ప్రభుత్వంగా చెప్పుకోలేక పోయారంటే ఆయన చిత్తశుద్దిని ప్రజలే అర్థంచేసుకోగలరన్నారు. 2004-05లో వ్యవసాయానికి, అనుబంద సంస్థలకు కేవలం 900కోట్లు ఉండేదని, నేడు 5500కోట్లకు పెంచగలిగామన్నా రు. ఉచితవిద్యుత్‌, పావలావడ్డీపథకాలు అదనంగా ఉన్నాయన్నారు. వ్యవసాయాన్ని వేరేగాచూపించిప్రత్యేక బడ్జెట్‌ పెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి ప్రధానమని, దీనిని సమకూర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. గతంలో 8,9వేల కోట్లుమాత్రమే రైతుల కు బ్యాంకులనుంచి రుణాలిచ్చేవారని, నేడు ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే 72వేల కోట్లు ఒక్కసంవత్సరంలో ఇస్తు న్నాయన్నారు. కేంద్రంలో సోనియా తీసుకున్న నిర్ణయం మేరకే ఇంతమొత్తం రుణాలు రైతులకు వస్తున్నా యన్నారు. ఇంతే కాకుండా సంవత్సరం లోపు రైతులు తీసుకున్న అప్పులను తిరిగిచెల్లిస్తే వడ్డీని ప్రభుత్వ మే భరిస్తుందన్నారు. అసలు కట్టండి చాలు, వడ్డీ అసలే వద్దు అని ప్రబుత్వం పెద్ద ఎత్తున నినాదంగా పనిచే స్తుందన్నారు. లక్ష రూపాయలలోపు అప్పులు తీసుకున్న రైతులు సుమారు 95లక్షల మంది ఉన్నారన్నారు. వారందరికి ఈవడ్డీమినహాయింపు వర్తిస్తుందన్నారు. పంటలు పండాలంటే నీరు ప్రధానమని, వాటిని సమకూ ర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో వర్షాలు తక్కువగా ఉన్నా ఎక్కువగా దిగుబడి వచ్చిందంటే ప్రబుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. తక్కువగా నీరున్నా కూడా డ్రిప్‌, స్పింక్లర్‌ ఇరిగేషన్‌ ద్వారా వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. రైతులకు ఇచ్చిన అప్పులను పూర్తిగా మాఫీచేస్తామంటూ చంద్రబాబు అసత్యాలు చెప్తున్నాడని విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన రుణాలను మాఫీచేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు. దేశంలో రైతుల రుణాలు మాఫీచేయా లంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే సాద్యం అవుతుందన్నారు. దేశంలో ఒకే ఒకసారి సోనియా నేతృ త్వంలో 63వేలకోట్ల రుణాలను మాఫీచేస్తే రాష్ట్రంలో 13వేల కోట్లు మాఫీ అయ్యాయన్నారు.  ఒక సంవత్స రంలోనే రైతులకు 72వేలకోట్ల రుణాలు ఇస్తుంటే మాఫీ ఎలా సాధ్యం అవుతుందో ఆలోచించాలన్నారు. జుట్టుంటేనే కొప్పు ముడుచుకునేదని సామెత చెపుతూ నీరుంటేనే వ్యవసాయం దివ్యంగా సాగుచేసుకోవ చ్చన్నారు. దీనిని గుర్తించిన తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దఎత్తున జలయజ్ఞం చేపట్టిందన్నారు. కోటి ఎకరాల ను అదనంగా సాగులోకి తేవాలన్నదే తమ లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు 22లక్షలు పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 ప్రాజెక్టులు పూర్తిచేయడమో, పాక్షికంగా పూర్తిచేయడం వల్లనో మపరో 30లక్షల ఎకరా లను సాగులోకి తెస్తున్నామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతోపాటు, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేం దుకు ప్రయత్నాలుచేస్తున్నామన్నారు. వీటిని కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించేలా ఒత్తిడి చేస్తున్నా మన్నారు. ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే మహారాష్ట్రతో కలిసి ఒప్పందం చేసుకున్నా మని, ఏరెండు రాష్టాల్రు గత ముప్పై ఏళ్లలో చేసుకోనే లేదన్నారు. నీరివ్వడంతోపాటు గిట్టుబాటు ధర కూడా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సన్నబియ్యంకు క్వింటాల్‌కు 1500రూపాయలు ప్రకటించామన్నారు. కేంద్రప్రభుత్వం 1280రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే రాష్ట్రం 1500 ఇస్తోందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేం దు కు ఏఒక్క రైతు ముందుకు రావడంలేదని, బయట వారికి 1600నుంచి 1800 పొందుతున్నారన్నారు. ఒక్క రూపాయి బియ్యం పథకాన్ని ప్రారంభంచడం జరిగిందన్నారు. పేద కుటుంబాలకు అండగా ఉండేందు కుగాను 9వస్తువులను కలుపుకుని 185 రూపాయలకే ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరో 10 రకాల వస్తువులను కలుపుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 1250 కోట్లు, బిసిలకు 4027కోట్లు, మైనార్టీలకు 1020 కోట్లు ఒక్క సంవత్సరమే వెచ్చిస్తున్నామన్నారు. రైతులకు చిట్టచివరిగా ప్రబుత్వం కల్పించేది పంటలు చెడి పోయినప్పుడు, నష్టం సంబవించినప్పుడు పరిహారం ఇవ్వడమన్నారు. 1999 వరకు 1250 రూపాయల పరి హారం మాత్రమే ప్రభుత్వాలు చెల్లించేవని, చంద్రబాబు హయంలో కేవలం 1500కు మాత్రమే పెంచాడన్నా రు.2004లో కాంగ్రెస్‌ అదికారంలోకి రాగానే 4500 పెంచడం జరిగిందని, తాను సిఎం అయ్యాక తొలినాళ్ల లో 6వేలకుపెంచామని, ప్రస్తుతం 10వేల రూపాయలిస్తున్నామన్నారు.  గతఖరీఫ్‌నాటికి,  ప్రీరబీ వరకు పంట లు నష్టపోయిన రైతులకు 1636కోట్ల రూపాయలను పరిహారం క్రింద రైతులకు చెల్లించామన్నారు. తాను నడిపిస్తున్న స్పీడ్‌ 2014వరకు కొనసాగించాల్సిందేనన్నారు. ఇందుకు ప్రజలు మద్దతివ్వాలని కోరారు. కంటే కూతురునే కనాలనే భావన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళా జనాభా రోజురోజుకు గణనీయంగా తగ్గిపోతుందని, దీని వల్లే బంగారు తల్లి కార్యక్రమాన్ని తీసుకు రావడం జరిగిందన్నారు. దీనికి సైతం చట్టబద్దత తీసుకువస్తామన్నారు.