తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం.

    హెల్త్ చెకప్ కి వచ్చిన ఓపీ పేషెంట్ ను చెప్పుతో కొడతానని అవమానపరిచిన హెల్త్ సూపర్వైజర్ జయమాలిని.

తొర్రూర్:10 అక్టోబర్( జనంసాక్షి )    మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనారోగ్యంతో ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చిన ఓపి పేషెంట్ ను హెల్త్ సూపర్వైజర్ జయమాలిని చెప్పుతో కొడతానని దురుసుగా మాట్లాడడం జరిగినది. పడుతున్న వర్షాల కారణంగా జలుబు దగ్గు రావడంతోవేర్పుల సుగుణమ్మ తనకు ఆరోగ్యం సుస్తి గా ఉండడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి వెళ్లగా ఆస్పత్రి ఓపి చూస్తున్న డాక్టర్ కరోనా మరియు టైఫాయిడ్ టెస్టులు చేయించుకోమని చెప్పగా కోవిడ్ పరీక్షలు చేసే దగ్గరికి వెళ్ళగా కోవిడ్ పరీక్ష కేంద్రం మూసివేయడంతో పక్కనే ఉన్న ఏఎన్ఎం లు మరియు హెల్త్ సూపర్వైజర్ దగ్గరికి వెళ్లి ఈ టెస్టులు ఎక్కడ చేస్తారో చెప్పమని అడగగా హెల్త్ సూపర్వైజర్ అయినా జయమాలిని మా దగ్గరికి ఎందుకు వచ్చావు దూరంగా వెళ్లిపో అని నానా బూతులు తిడుతూ దగ్గరికి వస్తే నిన్ను చెప్పుతో కొడతానని అవమాన పరచడం ,ప్రక్కన ఉన్నటువంటి ఇతర హెడ్ నర్సులు కూడా హేళన చేస్తూ  వెకిలి నవ్వులు నవ్వడం జరిగినది. సంబంధిత పేషంట్ అవమానభారంతో మీడియాని ఆశ్రయించి తనను అవమానపరిచిన హెల్త్ సూపర్వైజర్ పై చర్య తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ గుండాల మురళీధర్ కు ఫోన్ చేయగా మీరు హాస్పిటల్ లో డిస్ట్రబ్ చేయకూడదు. మీరు హెల్త్ సూపర్వైజర్ ను ప్రశ్నించకూడదు రేపు నేను వచ్చిన తర్వాత సమాధానం చెప్తానంటూ హాస్పటల్లో డిస్టర్బ్ చేస్తే బాగుండదు అంటూ బెదిరించడం జరిగినది. డిప్యూటీ డిఎంహెచ్వో గుండాల మురళీధర్ పేషంట్ మరియు వారి బంధువులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగినది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన  రోగులపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు, ఏఎన్ఎంలు , హెల్త్ సూపర్వైజర్లు ఇలా అవమానపరచడం ఎంతవరకు న్యాయమని ప్రజలు తెలుపుతున్నారు.
నిరుపేద, మధ్యతరగతి ప్రజలు జలుబు జ్వరం దగ్గు ఇతర ఏ రోగాలు వచ్చిన వారు మొదట సంప్రదించేది  ప్రభుత్వ ఆసుపత్రిని, పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి చూయించుకునే స్తోమత లేక బిల్లులు కట్టలేక మరియు మందులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి పేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ కి వస్తారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను చూసి ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, హాస్పిటల్ సిబ్బంది ఇలా అవమానపరచడం చాలా బాధాకరమని బాధితులు తెలుపుతున్నారు.