తొలి దశ ఉద్యమకారుల స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):1969లో తొలి దశ ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్ర పోరాట స్ఫూర్తితో నిర్వహించిన మలిదశ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు అన్నారు.ఆదివారం స్థానిక కిరాణా ఫ్యాన్సీ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.తొలి దశ ఉద్యమస్ఫూర్తితో నిర్వహించిన మలిదశ ఉద్యమంలో 1969 ఉద్యమ కారులు భాగస్వాములై ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్ర పోషించారని గుర్తుచేశారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 1969 ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.1969 ఉద్యమకారుల్లో ఇప్పటికే 80శాతం మంది తనువు చాలించారని,మిగిలిన వారికి న్యాయం చేయాలన్నారు.పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉచిత బస్ పాస్, వైద్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగస్వాములను చేయాలని కోరారు.అనంతరం 100 మంది 1969 ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం సంతోష్ రెడ్డి,కోశాధికారి ఏండ్ల చంద్రారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు నీలకంఠం చలమంద,జిల్లా అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు దేవరశేట్టి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకముడీ విశ్వేశ్వర్ రావు,జిల్లా కోశాధికారి నరేంద్రుని విద్యాసాగర్,గౌరవ సలహాదారులు పత్రం సీతారామ్ రెడ్డి, కుక్కడపు కాశయ్య,ఎస్ఏ హమీద్ ఖాన్, కడారి వెంకటయ్య, తడకమల్ల శాంతమ్మ,సూర్య నారాయణ, వనం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.