తోటి విలేకరి తండ్రి భౌతికకాయాన్ని పరామర్శించిన విలేఖరులు

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): మునగాల మండలంలో ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న లంజపల్లి నాగబాబు తండ్రి లంజపల్లి గుర్వయ్య‌ (80) శనివారం తెల్లవారుజామున మరణించాడు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహానికి మునగాల గ్రామంలోని వారి నివాసంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోటి విలేకరులు గురవయ్య పార్దివ దేహాన్ని పరామర్శించి, ఆయన కుమారుడు నాగబాబు కుటుంబానికి ఆయన తండ్రి మరణం తీరనిలోటని, కుటుంబ సభ్యులు మనో ధైర్యంతో ఉండాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గురవయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు జి యస్ రెడ్డి, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బెజవాడ గోవర్దన్,‌ ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ జె. సామ్యూల్, ఎస్ కె దస్తగిరి, సోమపంగు గోపి, తుమల వెంకటేశ్వర్లు, రమేష్, అనంతుల శీను, గ్రామపెద్దలు యుగేందర్ రెడ్డి, వీరభద్రం, రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.