త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేం: CM రేవంత్

జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు, త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ISBలో నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలి. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్, పీవీ సహా ఎంతోమంది నాయకులు మనందరికీ ఆదర్శం. నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నాను. డబ్బు, సమయం, వ్యక్తిగత జీవితం.. ఇలా అన్నీ త్యాగం చేయాలి’ అని అన్నారు.