థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై మరోమారు ఆందోళన


నీతి ఆయోగ్‌ తాజా హెచ్చరికలతో అప్రమత్తం కావాలి
తాజాగా 1.03 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు
న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అదుపులో ఉందని తాజా పరిస్థితులను తెలియచేస్తున్నాయి. తాజాగా కొత్త కేసులు 19 శాతం మేర తగ్గి, 25 వేలకు చేరాయి. సుమారు ఐదు నెలల కనిష్ఠానికి క్షీణించాయి. క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 25,072 మంది మహమ్మారి బారిన పడగా..389 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం కేసులు 3.24కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756గా ఉంది. నిన్న 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్ల(97.63 శాతం)కు చేరాయి. కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924(1.03 శాతం) మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న కేవలం 7,95,543 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 58.25 కోట్లకు చేరింది. ఇదిలావుంటే దేశంలో కరోనా మహమ్మారి మరోమారు తన వికృతరూపం చూపనుందని నీతి ఆయోగ్‌ తాజాగా కరోనా థర్డ్‌ వేవ్‌పై హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అప్పుడు కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయని అంచనా వేసింది. అందుకే ఈ పరిస్థితులకు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచింది. విూడియాకు అందిన సమాచారం ప్రకారం… రానున్న కరోనా దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే అప్రమత్తమవుతూ, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని సూచింది. 2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్‌ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్‌ సిలిండర్లు
కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్‌ ఐసోలేషన్‌ కేర్‌ బెడ్లు సిద్ధం చేయాలని సూచించింది. నీతి ఆయోగ్‌ దీనికి ముందుగా 2020 సెప్టెంబరులో కరోనా సెకెండ్‌ వేవ్‌ గురించి హెచ్చరించింది. ఈసారి కూడా థర్డ్‌ వేవ్‌ గురించి హెచ్చరికలు జారీ చేసింది. కాగా దేశంలో గడచిన 56 రోజులుగా 50 వేలకు దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గడచిన 24 గంటట్లో దేశంలో కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 403 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 4 లక్షల 34 వేల 367కు చేరింది.