*దళితులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.

చిట్యాల 11( జనంసాక్షి) దళిత బంధుతో దళితులను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తూ దళితులను ఒక బానిసల్లాగా చూస్తుందని ఎస్సి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి అన్నారు. ఆదివారం  మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ   ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు రత్న రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బంధుతోనే దళితులను దగా చేస్తూ ,మోసం చేస్తూ దళితులను ఒక బానిసల్లాగానే చూస్తూ వారిని అయోమయానికి గురి చేసినటువంటి ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ దళితులను విస్మరిస్తూ దళితులను ఒక ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ, వారిని నిరంతరం మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ కు రానున్న రోజుల్లో దళితులంతా ఏకమై రాజకీయ సమాధి కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దళితులకు మూడెకరాల భూమి హామీ కూడా తుంగలోకి తొక్కి, దళిత బంధు పేరుతోనే ఒక కొత్త నాటకానికి తెరలేపి అర్హులైన దళితులకు కాకుండా కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బందు ఇవ్వడం సిగ్గుచేటు అని,  దళితులను మోసం చేస్తే మాత్రం అంబేద్కర్ వారసులుగా కదం తొక్కి ముందుకు కదలవలసిన పరిస్థితి ప్రతి ఒక్క దళిత బిడ్డపై ఉందని ఆయన అన్నారు.
ఈరోజు ప్రపంచంలోనే దళితులను ముందు వరుసలో నిలబెట్టే పనిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లవేళలా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ దళితులకు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎల్లవేళలా రుణపడి ఉండాలని అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు, శ్రీ పెళ్లి అనిల్ బిజెపి మండల ఉపాధ్యక్షులు గజనలా రవీందర్ కిసాన్ మండల అధ్యక్షులు రాయని శ్రీనివాస్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు అనుపమ మహేష్ బీజేవైఎం మండల అధ్యక్షులు శ్రీకాంత్ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి వల్లాల ప్రవీణ్ బూత్ అధ్యక్షులు చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.