దళితుల ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం: విప్ రేగా…

బూర్గంపహాడ్ జూలై 22(జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాా, బూర్గంపహాడ్ మండలం ముసలిమడుగు గ్రామ పంచాయతీ, రామాపురం గ్రామం సమ్మక్క సారక్క ఆలయం ప్రాంగణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో మండలానికి చెందిన పలువురి దళిత బంధు లబ్ధిదారులకి  ట్రాక్టర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారని, ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా వ్యాపారాల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళిత సాధికారత తెచ్చిన మహోన్నతుడు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దళితులు ఆర్థిక ఎదుగుదలను టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి, మండల టిఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి,  అధికారులు పాల్గొన్నారు.
Attachments area