దళిత బంధు పథకాన్ని పకడ్బందిగా అమలు చేయాలి

చేర్యాల తహసీల్దార్ కు టీ-ఎమ్మార్పీఎస్ వినతి
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పకడ్బందిగా అమలు చేసి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని తహసీల్దార్ ఎస్.కె ఆరిఫా కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధుతో పాటు పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలలో ఏ ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా మంజూరు కాకపోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం దళితుల గురించి పనిచేస్తున్న ప్రభుత్వముగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భూమిగారి శ్రీరామ్, మద్దూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల భూపతి, చేర్యాల మండల అధ్యక్షులు పోతుగంటి కిషోర్ భూమిగారి దామోదర్, చేర్యాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మైసగళ్ళ శ్రీకాంత్, పాకాల అనిల్, సుంచు తిరుపతి, భూమిగారి విజయ్, గడిపే శ్రీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area