దశాబ్ది వేళ సుందరీకరణ పనులు

నల్లగొండ,మే31 (జనంసాక్షి): తెలంగాణ సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని జూన్‌2 నుంచి ప్రారంభంకానున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతోపాటు రహదారులవెంట మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు, సిబ్బంది ఆదేశాలిచ్చారు. నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ, అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. దశాబద్ది ఉత్సవాల వేళ మొత్తం మొక్కలను నాటడం, లైటింగ్‌, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. సుందరీకరణ గురించి మునిసిపల్‌ కమిషనర్‌, ఏజెన్సీ వారితో కలెక్టర్‌ చర్చించి వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. సబ్‌స్టేషన్‌ ఎదుట డ్రైనేజీ పనులను వేగంగా చేపట్టాలన్నారు.

తాజావార్తలు