దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 18(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మేడిది మధుసూదన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలకు సేవలందిస్తున్న మేడిది మధుసూదన్ సేవలను గుర్తించి దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ మరియు దసరా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ ఆత్మీయులు అందరికీ మధుసూదన్ కృతజ్ఞతలు తెలిపారు.