దివ్యాంగులకు చేయూత
– హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ
డోర్నకల్ ఆగస్టు జనం సాక్షి
దివ్యాంగులైన పిల్లలకు ఎల్లవేళలా అండగా ఉంటామని హెల్పింగ్ హాండ్స్,సర్వెంట్స్ ఆఫ్ చారిటీ సేవా సంస్థలు,ఎన్పిఆర్డి ఇండియా సంఘం
సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలియజేశారు. శనివారం పట్టణంలోని పట్టణంలో కట్కూరి వివేక్,కార్తిక్ అనే దివ్యాంగుల పిల్లలకు బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అందజేశారు. అదేవిధంగా మహబూబాబాద్ నందు కొందరికి అందించినట్లు తెలిపారు.కార్యక్రమంలో పాదర్ పాల్ రాజు,గుండు రవి,అజ్మీరా లక్ష్మణ్,చిత్తలూరి హుస్సేన్ పాల్గొన్నారు.