దుబాయ్‌లో దుబ్బాక వాసి మృతి
దుబ్బాక : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా ఆకారం గ్రామానికి చెందిన పెంటయ్య అక్కడి పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందాడు. పెంటయ్య ఆరేళ్ల కిందట గల్ఫ్ వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లభించలేదు. పర్యాటక వీసాపై రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల కిందట ప్రమాదవశాత్తు మృతి చెందాడని బంధువులకు ఫోన్ వచ్చింది. అంతకుమించి వివరాలు తెలియడం లేదు. పెంటయ్యకు భార్య బాలవ్వ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.