దుర్గా నగర్ కాలనీ లో దుర్గామాత ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు
కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30 (జనం సాక్షి ): నవరాత్రుల లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో ని దుర్గానగర్ కాలనీ దుర్గామాత ఆలయంలో మధ్యాహ్నం కీర్తిశేషులు గుమ్మడవల్లి శ్రీరాములు జ్ఞాపకార్ధం వారి కుమారులు అన్నదానం చేశారు.అమ్మవారిని లలితా పరమేశ్వరి అవతారంలో అలంకరించి పంచామృతుమ్ తో అభిషేకం చేశారు.లలితా సహస్ర నామ కుంకు మార్చన నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాత పసునూరి యుగేందర్ రెడ్డి,భాజాపా మండల అధ్యక్షుడు బోడిగే సాంబశివ గౌడ్, అందుగుల శ్రీను,సత్తయ్య, జాగటి యాదగిరి, భరత్,పూజారులు ఘంటసాల శివప్రసాద్ శర్మ, బిక్షం స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు