దూరవిద్యలో మల్టీమీడియా కంప్యూటర్ కోర్సు
శ్రీకాకుళం, జూలై 16 : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా విధానం అందిస్తున్న డిప్లమో ఇన్ మల్టీమీడియా కంప్యూటర్ కోర్సు(ఏడాది)ను వినియోగించుకోవాలని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశా ప్రిన్సిపల్ బమ్మిడి పోలీస్ కోరారు. స్థానిక ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏయూ కంప్యూటర్ విద్యలో మల్టీమీడియా కోర్సును దూరవిద్యా ద్వారా అందించేందుకు మల్టీమీడియా సాప్ట్‌వేర్ ఆద్వర్యంలో కోర్సును ప్రవేశపెట్టిందన్నారు. ఏడాదికి రూ. 21వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజును ఆరునెలల కొకసారి రెండుసార్లు చెల్లించవచ్చునన్నారు. మిలీనియమ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధి బి.హరి మాట్లాడుతూ కోర్సులో చేరిన విద్యార్థులకు శ్రీకాకుళం ఏయూ దూరవిద్య సెంటర్‌లోనే కంప్యూటర్ విద్యను అందించనున్నట్లు చెప్పారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శ్రీకాకుళంలోని ఏయూ స్టడీసెంటర్‌లో దరఖాస్తులు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఏయూ దూరవిద్య స్టడీ సెంటర్ ఇన్‌ఛార్జి ఎస్.టి.పి.కె.ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.