దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించిన ఎమ్మెల్యే
దంతాలపల్లి, జనంసాక్షి: నర్సింహులపేట మండలం పెద్దముప్పారం గ్రామంలో సోమవారం కురిసిన వర్షం, ఈదురు గాలులతో దెబ్బతిన్న మామిడితోటలను మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాలను తెలుసుకున్నారు. రైతులకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఆమెతో పాటు వ్యవసాయశాఖ అధికారులు, తహశీల్దార్ సుమతి పాల్గొన్నారు.