దేవాలయ నిర్మాణానికి విరాళం అందించడం అభినందనీయం”

 

పెన్ పహాడ్ డిసెంబర్ 07 (జనం సాక్షి) : మండల పరిధిలోని చీదెళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి దాతలు విరాళాన్ని అందించడం అభినందనీయమని సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి అన్నారు ఆలయ నిర్మాణ పనులలో భాగంగా గ్రామానికి చెందిన మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుర్రం అమృతా రెడ్డి రూ.
1,00, 116/- ఒక లక్ష నూట పదహారు రూపాయలు) అందజేయగా పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి సహరించాలని కోరారు అనంతరం వారితోపాటు ఆలయ నిర్మాణానికి బాధర బోయిన వీరబాబు రూ.25,000 బీరెల్లి అనసూయమ్మ కూతుర్లు రూ. 25,000అందజేసి
శ్రీ ఆంజనేయ స్వామి కళాపకర్షణ కార్యక్రమంలో భాగంగా ఆంజనేయస్వామి పురాతన రాతి విగ్రహాన్ని కదిలించి మరల పునర్ స్థాపితం ఏర్పాటు చేయుటకు యజ్ఞ యాగాలు హోమగుండం కార్యక్రమం, పూజా కార్యక్రమాలు గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగినది..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపిటిసి జూలకంటి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ బిజిగ గోపి,
ఆలయ నిర్మాణ ఇంచార్జ్ పోతుగంటి మల్లికార్జున్, వెన్న గోపిరెడ్డి, కీర్తి వెంకటరావు గౌడ్, మైనంపాటి పెద్ద వెంకటరెడ్డి,సురభి వెంకటేశం గౌడ్, కీర్తి ఎలమంచయ్య గౌడ్ ఆలయ అర్చకులు, చినపంగి తిరపయ్య విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామపంచాయతీ వార్డుసభ్యులు,ఆంజనేయస్వామి ఆలయ కమిటీ, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.