దేవా నాయక్ ని సన్మానించిన లంబాడా హక్కుల పోరాట సమితి
టేకులపల్లి, ఫిబ్రవరి 25( జనం సాక్షి ): టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య దేవా నాయక్ ని లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించి సన్మానం చేశారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా దేవా నాయక్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొచ్చే బాధ్యతలో భాగంగా పిసిసి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని వారి పేర్కొన్నారు. రాబోయే కాలానికి బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అపన్న హస్తం లాంటిదని వారు అన్నారు. అనంతరం లంబాడ ఉద్యమనేత శివా నాయక్,పీసీసీ రాష్ట్ర కార్యదర్శి భూక్య మంగీలాల్ నాయక్,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకారపు స్వప్న, గార బానోత్ రెడ్డి నాయక్, బోడా భీముడు నాయక్,భూక్య బన్సీలాల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సరిలాల్ నాయక్, ధర్మానాయక్, అర్జున్ చౌహన్, తదితరులు పాల్గొన్నారు.