దేవీ నవరాత్రుల పురస్కరించుకొని మహా అన్నదానం
బోనకల్, అక్టోబర్ 02(జనం సాక్షి):
బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో దేవీ నవరాత్రులు పురస్కరించుకొని స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద మహా అన్నదానం ఆదివారం నిర్వహించారు. అన్నదానం ప్రారంభోత్సవాన్ని ఏఎస్ఆర్ రియల్ ఎస్టేట్ ఎండి ఆవుల సైదేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గ మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నంబూరు నరసింహారావు, కుర్ర పాపారావు, కమిటీ సభ్యులు బోయినపల్లి ముఖేష్, బాలు, విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.రియల్ ఎస్టేట్ రంగంలో ఏఎస్ఆర్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త పుంతలుటలు తొక్కుతుందని ఆ సంస్థ ఎండి ఆవుల సైదేశ్వర రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చోప్పకట్లపాలెం గ్రామంలో ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో సామాన్య ప్రజలు సైతం ప్లాటు లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలని ఏఎస్ఆర్ సంస్థ నెరవేరుస్తుందన్నారు. అతి తక్కువ ధర నుంచి తమ వద్ద ప్లాట్లు, ఇల్లు, పంట పొలాలు అమ్మకాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. నీతి నిజాయితీతో, నిబద్ధతతో కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా ఎక్కడ అవినీతికి ఆర్భాటాలకు పోకుండా తమ సంస్థ కార్యకలాపాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఆర్ ఏజెంట్లు నంబూరి నరసింహారావు, కుర్ర పాపారావు, పారా కోటేశ్వరరావు, వీరబాబు పాల్గొన్నారు.