దేవుళ్ళపై అనుచిత వాక్యాలు చేసిన బైరి నరేష్ పై క0ప్లంట్..

 

 

 

 

 

 

 

భారత నాస్తిక సమాజం విద్యార్థి బైరి నరేష్ ఇటీవల ఓ సభలో దేవుళ్లపై అనుచిత వాక్యాలు చేసిన విషయం తెలిసిందే…దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలువురు తీవ్రంగా ఖండించారు.తాజాగా బై0సా పట్టణంలోని అయ్యప్ప స్వాములు ఇట్టి విషయాన్ని ఖండిస్తూ పట్టణంలోని పోలీస్ స్టేషన్లోఫిర్యాదు చేశారు. అనంతరం బైంసా అన్నపూర్ణ క్షేత్రంఅయ్యప్ప స్వామి ఆలయ అర్చకుడు మంత్రి సాయినాథ్ కిసాన్ గల్లి పెద్దలు అల్లకొండ సాయినాథ్ మాట్లాడుతూ…. హిందూ దేవి,దేవతలు అయ్యప్ప స్వామి పై అనుచిత వాక్యాలు చేయడం సరైన పద్ధతి కాదని ఇలాంటి చర్యలు రాష్ట్రంలో మళ్లీ పునరవృతమైతే చాలా పెద్ద మొత్తంలో అయ్యప్ప స్వాములు ఒకటి గా ఏకమై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి వారికి భగవంతుడే బుద్ధి చెప్తాడు అనిఅన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో భైంసా పట్టణ అయ్యప్ప స్వాములు కుంట శ్రీనివాస్ కోర్వ శ్రీనివాస్ శివాజీ వినోద్ బోయిడి రఘు కుంట కీర్తి కానోళ్ళ రాములు భైంసా స్వాములు వున్నారు.