పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..
కారకులైన నలుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్
ఆర్మూర్, మార్చి 18(జనంసాక్షి): విద్యార్థులను పరీక్షల్లో గట్టెక్కించి పాస్ చేయించాలన్న ఆతృత కాస్త ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెండ్ కు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి ఉర్దూ మీడియానికి సంబంధించిన విద్యార్థులకు తెలుగులో చదువు కాస్త అంతంత మాత్రంగానే ఉన్నారు.ఈ విషయాన్ని గ్రహించిన ఉపాధ్యాయులు ఉర్దూ మీడియం కి సంబంధించిన తెలుగు ప్రశ్న పత్రాన్ని సిమ్ కార్డు లేని ఫోన్ లో ఫోటో తీసి ఉంచాడు. ఈ ప్రశ్న పత్రాన్ని సంబంధిత ఉపాధ్యాయుడు ఫోటో తీసి వాట్సాప్ గ్రూపులో ఇతర పాఠశాల ఉపాధ్యాయుల ఫార్వర్డ్ చేశారు. ఉపాధ్యాయులకు ఫార్వర్డ్ చేరడమే కాకుండా ఇతర వాట్సాప్ గ్రూప్ లోకి ప్రశ్నాపత్రం చేరింది.ఇది కాస్త పూర్తిగా వైరల్ కావడంతో సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నాపత్రం లీకేజీ బయటకు పొక్కింది.దీని కారణంగా పేపర్ లీకేజీ విషయం ఉన్నతాధికారులకు చేరింది.బార్ కోడ్ ఆధారంగా ప్రశ్న పత్రాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఆలూర్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించినదిగా గుర్తించారు.దీంతో ఇందుకు కారకులైన నలుగురు ఉపాధ్యాయులను పాఠశాల చీఫ్ ఎగ్జామినర్ రాజేందర్,ఎస్జీటీలు సాగర్,ఉమేందర్,విజయ్ లను సస్పెండ్ చేశారు.చదువులు చక్కగా నేర్పించి విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలే తప్ప విద్యార్థులను తప్పటడుగులేసేలా ఇవేం పనులని పలువురు అంటున్నారు.మండల కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులను ప్రభుత్వ,ప్రైవేటు టీచర్లే మాస్ కాపీయింగ్ పాస్ చేయించేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. ఈ విషయంపై కూడా ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు



