తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్
` అమెరికాకు ముచ్చెమటలు
` ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా.. విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ
` డిమోనా నగరాన్ని తాకిన ఇరాన్ క్షిపణులు
` హర్మూజ్‌కు బ్రిటన్ అణు జలాంతర్గామి!
` ఖతార్‌లో కూలిపోయిన హెలికాప్టర్
` ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను మేం కాపాడతాం: ఇరాన్
టెహ్రాన్(జనంసాక్షి):ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్‌కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అణు పరిశోధన కేంద్రం సవిÖపంలోని భవనాలపై ఈ క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. శనివారం ఇరాన్ లోని కీలకమైన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే తాజాగా టెహ్రాన్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు రాగా.. వాటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అరాద్, డిమోనా నగరాల్లోని నివాస ప్రాంతాలపై క్షిపణులు పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అరాద్‌లో జరిగిన దాడిలో దాదాపు 88 మంది గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. దెబ్బతిన్న భవనాల నుంచి దాదాపు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు మరణించి ఉండవచ్చని ఇజ్రాయెల్ విÖడియా పేర్కొంది. అయితే, అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. భవన శిథిలాల కింద కొందరు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు.ఇక, ఇజ్రాయెల్‌కు కీలకమైన అణుపరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరంలోని ఒక భవనంపై క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడగా.. వారిలో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అరాద్ నగరంపైకి వచ్చిన క్షిపణిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమవడంపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ తాజా దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరాద్ మేయర్‌తో మాట్లాడానని.. గాయపడిన వారికి వైద్యసహాయం అందించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ దాడులకు తగిన విధంగా బదులు తీర్చుకుంటామని పేర్కొన్నారు.
డిమోనా నగరాన్ని తాకిన ఇరాన్ క్షిపణులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాన్ క్షిపణులు అక్కడి డిమోనా నగరాన్ని తాకాయి. ఈ దాడుల్లో 30మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని ‘లిటిల్ ఇండియా‘గా పిలుస్తారు. ఇక్కడి జనాభాలో దాదాపు 30శాతం భారత సంతతికి చెందినవారు ఉండడమే కారణం. కొన్ని దశాబ్దాల క్రితమే వారు స్థిరపడ్డారు.టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. 1950` 1960లలో భారత్` యూదు కమ్యూనిటీకి చెందిన అనేకమంది ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. వీరిలో అత్యధికులు మహారాష్ట్రకు చెందినవారు, కాగా కేరళ, కోల్‌కతాకు చెందిన వారూ ఉన్నారు. వారంతా డిమోనా ప్రాంతంలో స్థిరపడ్డారు. దీంతో అది లిటిల్ ఇండియాగా పేరు పొందింది. ఇటీవల మిజోరం, మణిపుర్‌కు చెందిన మరికొంతమంది భారత యూదులు కూడా డిమోనాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఈ నగరంలో దాదాపు 7,500 మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. వీరు అనర్గళంగా మరాఠీలో మాట్లాడగలరు. అక్కడక్కడా హిందీ మాటలు కూడా వినిపిస్తాయి. వారు నడిపే దుకాణాల్లో సోన్‌పాప్‌డి, గులాబ్ జామ్, పాప్రి చాట్, భేల్‌పురి వంటి భారతీయ రుచులూ పలకరిస్తాయి. ఇక్కడి భారతీయుల్లో అత్యధికులు వజ్రాల వ్యాపారులుగా, ఐటీ నిపుణులుగా కొనసాగుతున్నారు. ఆహారం మాత్రమే కాకుండా భారతీయ సంస్కతీ సంప్రదాయాలనూ పాటిస్తారు. ఓనం, దీపావళి వంటి పండగలను ఘనంగా నిర్వహిస్తారు. 2025లో ఇక్కడ నిర్వహించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్ట్‌లో నెల రోజుల పాటు థియేటర్లు కిక్కిరిసిపోయాయి. కొన్ని నెలల క్రితం ఆ నగరంలో జరిగిన మొట్టమొదటి భారతీయ సంగీత ఉత్సవానికి మంచి స్పందన లభించింది. డిమోనాతో పాటు హైఫా, టెల్ అవీవ్, అరద్, నెతన్యా, అఫులా వంటి నగరాల్లోనూ భారత సంతతి వారు ఉన్నారు.
హర్మూజ్‌కు బ్రిటన్ అణు జలాంతర్గామి!
ఖతార్‌లో కూలిపోయిన హెలికాప్టర్
ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను మేం కాపాడతాం: ఇరాన్
హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్‌ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన అణు జలాంతర్గామి ‘హెచఎంఎస్ ఆన్సన’ హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. దీనిని ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు బ్రిటిష్ విÖడియా పేర్కొంది. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పడోలు, శక్తిమంతమైన ఆయుధ సంపత్తి ఉన్నట్లు తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత తీవ్రరూపం దాలిస్తే.. ఇరాన్‌పై బ్రిటన్ దళాలు దాడులు చేయవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఖతార్‌కు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురై పర్షియన్ గల్ఫ్‌లో కూలిపోయింది. ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మతి చెందారు. మరో వ్యక్తి గల్లంతు కాగా.. అతడి ఆచూకీ కోసం సహాయక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సాంకేతిక లోపంతో హెలికాప్టర్ కూలినట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, చనిపోయిన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను మేం కాపాడతాం: ఇరాన్
వనరుల పరంగా ఎంతో కీలక దీవి అయిన గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇరాన్ అధికారి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ‘గ్రీన్‌లాండ్‌ను అప్పగించాలని ట్రంప్ మొదట ఐరోపాను బెదిరించారు. ఆ తర్వాత వారిని బతిమలాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా దాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఐరోపాకు నేను చెప్పేది ఒకటే.. విÖరు విÖ గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేకపోతే మా సాయం అడగండి. మేము ఆయన నుంచి దాన్ని కాపాడతాం. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. అయితే, ఆ దీవికి ఎలా రక్షణ కల్పిస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన తర్వాత గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ చేసిన ప్రకటనలు సంచలనం సష్టించాయి. దీనిపై చర్చలు జరపాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే, డెన్మార్క్ అందుకు నిరాకరించడంతో దీనిపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు. గ్రీన్‌లాండ్ విషయంలో తనకు మద్దతు తెలపని ఈయూ దేశాలపై అదనపు సుంకాలను విధిస్తానని తొలుత బెదిరించిన ఆయన.. తర్వాత వెనక్కి తగ్గారు. ఇరాన్ అధికారి వ్యాఖ్యలతో తాజాగా ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.
48 గంటల్లోగా హర్మూజ్ తెరవాలి
` లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తాం
` ట్రంప్ అల్టిమేటం
` మాపై దాడి చేస్తే మేమూ మీ కీలక ఇంధన వరనులపై దాడులు చేస్తాం
` దీటుగా బదులిచ్చిన ఇరాన్
` శత్రు నౌకలు మినహా అన్నీ వెళ్లొచ్చు!
` స్పందించిన ఇరాన్
వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని ఆదేశించారు. లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. “ఇప్పటి నుంచి సరిగ్గా 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవాలి. ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదు. దాన్ని పూర్తిగా తెరవకుంటే.. ఇరాన్‌లోని పలు విద్యుత్ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుంది. వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తాం. ముందుగా.. అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుంది” అని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా` ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు.
శత్రు నౌకలు మినహా అన్నీ వెళ్లొచ్చు! ` ఇరాన్
హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని, లేదంటే విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. శత్రు దేశాలకు చెందినవి మినహా అన్ని నౌకలు తమతో సమన్వయం చేసుకుంటూ హర్మూజ్ ద్వారా వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐరాసలోని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో)లో ఇరాన్ సీనియర్ ప్రతినిధి అలీ మౌసావి ఈ విషయాన్ని వెల్లడించారు.హర్మూజ్‌లో ప్రస్తుత పరిస్థితికి అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రధాన కారణమని మౌసావి ఆరోపించారు. దౌత్యానికి ఇరాన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, అయినప్పటికీ.. దురాక్రమణ నిలిపివేయడం, పరస్పర విశ్వాసం ఎంతో ముఖ్యమన్నారు. నావికుల రక్షణ, సముద్ర భద్రతను మెరుగుపరచడానికి ఐరాస విభాగమైన ఐఎంవోకు సహకరించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందన్నారు. ఇదిలాఉంటే, హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకుంటే.. ఇరాన్‌లోని పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. అతిపెద్ద విద్యుత్ కేంద్రంతోనే ఈ దాడులు ఆరంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి ఈ స్పందన రావడం గమనార్హం.
ఇరాన్ యుద్ధంతో గాల్లోకి 50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు
అమెరికా`ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డ్రోన్లు, క్షిపణులు, బాంబు దాడులతో భారీగా కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. యుద్ధం మొదలైన 14 రోజుల్లోనే 50 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడినట్లు ‘క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్‌స్టిట్యూట’ వెల్లడించింది. భవనాల ధ్వంసంతో 24 లక్షల టన్నులు, రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లపై దాడులతో 18 లక్షల టన్నుల ఉద్గారాలు వెలువడినట్లు తెలిపింది. ఈ ఉద్గారాలతో పర్యావరణానికి 1.3 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ 14 రోజుల్లో విడుదలైన విష వాయువులు ఓ దీవి ఏడాది పొడవునా విడుదల చేసే కాలుష్య ఉద్గారాల కంటే ఎక్కువని పరిశోధకులు పేర్కొన్నారు. 11 లక్షల కార్లను ఏడాది పాటు రోడ్లపై నడిపితే వచ్చే కాలుష్యం ఈ యుద్ధం వల్ల వచ్చిందన్నారు. దీనివల్ల యుద్ధం కొనసాగుతున్న ప్రాంతాల్లో యాసిడ్ (ఆమ్ల) వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ గణాంకాలు కేవలం 14 రోజులవేనని.. ముందు రోజుల్లో యుద్ధం తీవ్రమైతే కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. హర్మూజ్‌లోని చమురు ట్యాంకర్‌లపై దాడుల వల్ల సముద్ర జలాలు కూడా విషపూరితమవుతాయని..దాని వల్ల జలచరాలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతాయన్నారు. ఇదీ చదవండి: ‘లిటిల్ ఇండియా’ను తాకిన ఇరాన్ క్షిపణులు



