హిందు మహాసముద్రాన్ని తాకిన యుద్ధమంటలు

` బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగించిన ఇరాన్
` నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం
` ఖండించిన ఇరాన్.. అంతర్జాతీయ ఉల్లంఘనేనని ఆరోపణ
` దాడులను తీవ్రతరం చేసిన ఐఆర్‌జీసీ
` ఇజ్రాయిల్ యుద్దవిమానం కూల్చివేత
` వచ్చే వారం దాడులు మరింత తీవ్రతరం: ఇజ్రాయెల్ మంత్రి
టెహ్రాన్(జనంసాక్షి):రోజురోజుకూ ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇలా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 4 వేల కిలోవిÖటర్ల దూరంలోని యూఎస్, యూకేల సంయుక్త సైనిక స్థావరమే లక్ష్యంగా రెండు బాలిస్టిక్ క్షిపణుల ను ప్రయోగించినట్టు అంతర్జాతీయ విÖడియాలో కథనాలు వెలువడ్డాయి. హిందూ మహాసముద్రంలోని డియేగో గార్సియా దీవిలోగల సైనిక స్థావరంపై ఇరాన్ ఈ మిసైల్స్‌ను ప్రయోగించిందని సమాచారం. చాగోస్ ద్వీపసముదాయంలో ఇదొక భాగం. విÖడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన తొలి మిసైల్ మార్గమధ్యంలోనే విఫలమైంది. మరో మిసైల్‌పై ఒక అమెరికా యుద్ధ నౌక క్షిపణి విధ్వంసక రాకెట్‌ను ప్రయోగించింది. ఈ దాడిలో రెండో మిసైల్ ధ్వంసమైందా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై అమెరికా ఇంకా స్పందించ లేదు. ఇప్పటివరకూ ఇరాన్ మిసైల్ దాడులు పశ్చిమాసియాకే పరిమితమయ్యాయి. తాజాగా హిందూ మహాసముద్రంలోని దీవిని ఇరాన్ టాª`గ్గంªట్ చేసిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇదే నిజమైతే ఐరోపా ఖండంలోని పలు యూఎస్ సైనిక స్థావరాలు ఇరాన్ దాడుల పరిధిలోకి వచ్చినట్టు అవుతుందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల శ్రీలంకకు దక్షిణాన హిందూ మహాసముద్ర జలాల్లో ఒక ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా సబ్‌మెరైన్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. టార్పిడో ప్రయోగంతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ నౌక నీట మునిగిపోయింది. ఈ ఘటనలో సుమారు 85 మంది మరణించారు. భారత్‌లో జరిగిన మిలన్`2026 నావికాదళ విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ నౌక తిరిగి వెళుతున్న సమయంలో అమెరికా దాడి చేసింది. ఇరాన్ నావికా దళాన్ని నిర్వీర్యం చేయడం తమ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటని అమెరికా అప్పట్లో పేర్కొంది. అయితే ఈ క్షిపణులను ఎప్ప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో యూఎస్`యూకేకు ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్. అందులో అతిపెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలాపాల కోసం అమెరికా దీనిని ప్రధానంగా వినియోగిస్తోంది. ఇదిలాఉంటే.. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు, ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ఐలాండ్‌ను ఆక్రమించే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియాలో మరో మూడు యుద్ధనౌకలను మోహరించేందుకు అమెరికా సిద్ధమైంది. యూఎసఎస్ బాక్సర్, మరో రెండు యుద్ధనౌకలు దాదాపు 2,500 మంది నౌకాదళ సిబ్బందితో పశ్చిమాసియా దిశగా వెళ్తున్నట్లు అమెరికా అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యానికి చెందిన యాంఫిబియస్ అసాల్ట్ షిప్ యూఎసఎస్ ట్రిపోలీ పశ్చిమాసియా వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది.ఈ పరిణామాల వేళ..ఈ క్షిపణుల ప్రయోగం గురించి వెలుగులోకి వచ్చింది. తమవద్ద క్షిపణుల పరిధి 2000 కి.విÖ. వరకు ఉంటుందని ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. కానీ చెప్పిన దానికంటే ఇరాన్ వద్ద ఉన్న మిస్సైళ్ల పరిధి చాలా ఎక్కువే ఉండొచ్చని తాజా ఘటన వెల్లడి చేస్తోంది.
అణు కేంద్రంపై భీకరదాడులు
దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజాగా ఇరాన్‌లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక విÖడియా సంస్థ తస్నిమ్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నతాంజ్ అణు క్షేత్రంపై దాడులు చేయడం ఇది రెండోసారి. నతాంజ్ అణు క్షేత్రంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడ్డాయని, అయితే రేడియోధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదని, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సమస్యా లేదని తెలిపింది నతాంజ్ క్షేత్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇతర అణు భద్రత నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. నేరపూరిత చర్యల్లో భాగంగానే నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగిన సంగతి తెలిసిందే .తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని, ఇక ఆ దేశానికి యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. నెతన్యాహు ప్రకటించిన కొద్ది గంటల్లోనే నతాంజ్ అణు కేంద్రంపై దాడులు జరగడం గమనార్హం. నతాంజ్ అణు కేంద్రం టెహ్రాన్‌కు దాదాపు 220 కిలోవిÖటర్ల దూరంలో ఉంది.
వచ్చే వారం దాడులు మరింత తీవ్రతరం: ఇజ్రాయెల్ మంత్రి
పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడుల తీవ్రత రానున్న వారం మరింత పెరగనుందని చెప్పారు. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కట్జ్ ఈమేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.“ఇరాన్ పై దాడులు మరింత ముమ్మరం కానున్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రతకు, అమెరికా ప్రయోజనాలకు పొంచి ఉన్న ముప్పు తొలగిపోయే వరకు.. ఆ దేశ పాలనాయంత్రాంగం, కమాండర్లు, వ్యూహాత్మక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుంటాం. యుద్ధ లక్ష్యాలన్నీ సాధించే వరకు విశ్రమించేది లేదు” అని సైనిక అధికారులతో సవిÖక్ష సందర్భంగా కట్జ్ అన్నట్లు స్థానిక విÖడియా పేర్కొంది. ఇరాన్ నుంచి అణుముప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం, ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యాలని అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న విషయం తెలిసిందే.హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా ద్వీపంలో ఉన్న యూఎస్`యూకే సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించడాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను దుస్సాహసంగా పేర్కొంది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు, హర్మూజ్ జలసంధిని మూసివేయడం వంటివి.. తమ ప్రయోజనాలకు, తమ మిత్రదేశాలకు ముప్పుగా బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది.ఇరాన్‌పై దాడుల్లో బ్రిటన్ ఇంతవరకు నేరుగా పాల్గొనలేదు. కానీ.. ఆ దేశంపై దాడుల కోసం అమెరికాకు తమ స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతించింది. హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులను కట్టడి చేసేందుకు.. డిగో గార్సియా సహా ఇతర స్థావరాలను కూడా ఉపయోగించుకోవచ్చని శుక్రవారం తెలిపింది. బ్రిటన్ ఈ ప్రకటన చేయడానికి ముందే డిగో గార్సియా లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ ద్వీపం.. ఇరాన్ నుంచి దాదాపు 4,000 కిలోవిÖటర్ల దూరంలో ఉంది. దీనికి ఎంత సవిÖపానికి క్షిపణులు వచ్చాయనేది తెలియరాలేదు.
ఇజ్రాయిల్ యుద్దవిమానం కూల్చివేత
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు అడ్డుకట్ట పడటం లేదు. తమ భూభాగంపై దాడికి దిగిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ మిలిటరీ శనివారంనాడు ప్రకటించింది. దీనికి ఒకరోజు ముందే ఆమెరికా ఎఫ్`35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఢీ కొట్టామని ఇరాన్ ప్రకటించుకుంది.ఇజ్రాయెల్ యుద్ధవిమానంపై దాడి జరిగినట్టు ఇజ్రాయెల్ కూడా గుర్తించిందని ’టెహ్రాన్ టైమ్స’ తెలిపింది. తమ యుద్ధవిమానాన్ని టాª`గ్గంªట్ చేస్తూ ఉపరితలం నుంచి గగనతలంపైకి క్షిపణిని ప్రయోగించారని ఇజ్రాయల్ మిలిటరీ పేర్కొంది. ఏ తరహా యుద్ధ విమానం అనేది మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ విమానంపై క్షిపణి ప్రయోగం జరిగిందని, అయితే విమాన సిబ్బంది ప్రామాణిక విధానాలను అనుసరించడం ద్వారా ముప్ప్పును తప్పించారని, ఎలాంటి నష్టం లేకుండా మిషన్‌ను పూర్తి చేశారని ’ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల’ పేర్కొంది. ఇరాన్ క్షిపణి అతి సవిÖపానికి రావడంతో పైలట్ వత్తిపరమైన నైపుణ్యంతో అత్యంత వేగంగా స్పందించి దాడిని తప్పించినట్టు ఆ కథనం పేర్కొంది. విమానానికి నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం లేదు. కాగా, ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఇటీవల దాడులు జరిపిన అమెరికా`ఇజ్రాయెల్ దళాలు శనివారంనాడు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలు లీక్ అవ్వలేదని, పరిసర ప్రాంత నివాసితులకు ప్రమాదం వాటిల్లలేదని వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ నేరపూరిత చర్యల్లో భాగంగానే ఈదాడి జరిపిందని, అణుభద్రతా నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలకు తూట్లు పొడిచిందని నిప్ప్పులు చెరిగింది.

 

యుద్ధం ఆపించండి మహాప్రభో..
` హర్మూజ్‌ను వెంటనే తెరవండి..!
` ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి
` ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేత
` యుద్ధం వేళ అమెరికా కీలక నిర్ణయం
` ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ప్రధాని మోదీ ఫోన్
వాషింగ్టన్(జనంసాక్షి):హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. దాడులు కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి. ఇరాన్ చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్పభావం పడుతోందని పేర్కొన్నాయి. ఈమేరకు యూఏఈ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్టేలియా, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, బహ్రెయిన్ తదితర దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి.
“గల్ఫ్‌లోని నిరాయుధ వాణిజ్య నౌకలు, చమురు, గ్యాస్ కేంద్రాలు సహా పౌర మౌలిక సదుపాయాలపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడులు, హర్మూజ్ జలసంధిని మూసివేయడాన్ని ఖండిస్తున్నాం. సముద్ర చట్టాలకు సంబంధించి ఐరాస ఒప్పందంతో పాటు స్వేచ్ఛాయుత నౌకాయానం అనేది అంతర్జాతీయ చట్టంలో ఓ ప్రాథమిక సూత్రం. ఇరాన్ చర్యలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై, ముఖ్యంగా అత్యంత బలహీన వర్గాలపై ప్రభావం పడుతోంది” అని యూఏఈ విదేశాంగ శాఖ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఇందులో 22 దేశాలు సంతకాలు చేశాయి.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ప్రధాని మోదీ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్, నౌరుజ్ (పర్షియన్ నూతన సంవత్సరం) శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని మోదీ ఖండించారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని.. నౌకామార్గాలు తెరచి ఉంచడం, వాటిని సురక్షితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు.యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడటం ఇది రెండోసారి. మార్చి 12న ఓసారి ఫోన్‌లో సంభాషించిన ప్రధాని.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్యమార్గాల్లోనే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని ఇరాన్ అధ్యక్షుడికి సూచించారు. అనంతరం సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్, మలేసియా, ఫ్రాన్స్ అధినేతలతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించారు.
యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లలోకి వస్తుందన్నారు. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు విక్రయించడానికి మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని స్పష్టంచేశారు. అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్ తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్ ఇలాంటి ప్రకటన చేసిందన్నారు.
ఇరాన్ ముడి చమురుపై.. భారత్ రిఫైనరీల దష్టి
యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో, ఆ చమురును భారత్ సహా ఆసియాలోని ఇతర రిఫైనరీలు కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు, చెల్లింపుల విషయంలో అమెరికా నుంచి స్పష్టత కోసం ఆయా సంస్థలు వేచి చూస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది.ఇరాన్‌కు చెందిన 170 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇప్పటికే సముద్ర మార్గంలో ఉండగా.. యుద్ధం కారణంగా నిలిచిపోయింది. వీటికి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టిన అమెరికా.. మార్చి 20 లేదా అంతకుముందు నౌకల్లోకి లోడ్ చేసి ఏప్రిల్ 19 నాటికి డిశ్చార్జ్ కావాల్సిన ముడి చమురుకు 30 రోజుల సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఓ ప్రకటన చేశారు. మరోవైపు, ఇప్పటికే 130 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇరాన్ చమురుతో కలిపి చూస్తే.. భారీగానే అంతర్జాతీయ మార్కెట్‌లోకి ముడిచమురు అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పరిశీలకుల అంచనా.

తుదిదశకు యుద్ధం
` ఇరాన్‌పై సైనిక చర్యను విరమించే ఆలోచనతో ఉన్నాం
` సైనిక చర్యలను తగ్గించే విషయం పరిశీలిస్తున్నాం
` కానీ పూర్తిగా కాల్పుల విరమణ జరగదు
` ట్రూత్ సోషల్ విÖడియాలో ట్రంప్ పోస్ట్
వాషింగ్టన్(జనంసాక్షి): యుద్దంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత మొదలయ్యింది. ఆయిల్ , గ్యాస్ నిల్వలు తగ్గడం, రవాణ² ఆగిపోవడంతో ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో యుద్దం ఆగాలని అంతా కోరుకుంటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధ జ్వాలలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్‌తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొనడం గమనార్హం. ఇరాన్‌పై సాధించిన సైనిక విజయాలను వివరిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. ఇరాన్‌పై మా లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. మా సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ దేశ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ’ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా హర్మూజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా రక్షణ కల్పించదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ సాయం కోరితే.. సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ ముప్ప్పు తొలగిపోయిన తర్వాత ఆ అవసరం ఉండదన్నారు. ఇకపోతే యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లలోకి వస్తుందన్నారు. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు విక్రయించ డానికి మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని స్పష్టంచేశారు. అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్ తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్ ఇలాంటి ప్రకటన చేసిందన్నారు.