భారత్ చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక
` తీరనున్న ఎల్‌పీజీ కొరత
` రష్యాకు చెందిన చమురు నౌక కూడా భారత సముద్రజలాల్లోకి ప్రవేశం
న్యూఢిల్లీ(జనంసాక్షి):పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు, ఎల్‌పీజీ సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలో ముఖ్యంగా ఎల్‌పీజీకి కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఎల్‌పీజీ నౌక భారత్‌కు చేరింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి బయల్దేరిన పయనీర్ నౌక ఎల్‌పీజీ లోడ్‌తో కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు ఆదివారం చేరుకుంది.దీంతోపాటు రష్యాకు చెందిన చమురు నౌక కూడా దేశ సముద్రజలాల్లోకి ప్రవేశించింది. అక్వాటైటాన్ పేరుతో రష్యా నుంచి వచ్చిన ఈ నౌక శనివారమే మంగళూరు పోర్టును చేరినట్లు పలు ఆంగ్ల విÖడియా సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సంక్షోభాన్ని తగ్గించడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మార్చి 12 నాటికి రష్యా నౌకల్లో లోడ్ చేసిన చమురును కొనుగోలు చేయొచ్చని అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో రష్యా నౌక భారత్‌కు చేరుకోవడం గమనార్హం.


