ప్రపంచం కోసమే ఇరాన్‌తో యుద్ధం

` అమెరికా కలిసి పోరాడుతున్నాం: నెతన్యాహు
` 48 గంటల్లో పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిందని విమర్శలు
టెలఅవీవ్(జనంసాక్షి):యావత్ ప్రపంచం కోసం అమెరికా`ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌తో పోరాడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. గత 48 గంటల్లో పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిందని నెతన్యాహు వెల్లడించారు. ప్రపంచాన్ని ఇరాన్ ప్రమాదంలో పడేస్తోందనడానికి ఈ దాడులే రుజువన్నారు. అదష్టవశాత్తూ ఇరాన్ దాడుల్లో తమ దేశ పౌరులెవరూ చనిపోలేదని పేర్కొన్నారు. కానీ ఇరాన్ ఉద్దేశం సామాన్య పౌరుల్ని చంపడమేనని మండిపడ్డారు. తామూ దాడులు చేస్తున్నాం, కానీ ఇరాన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని గుర్తు చేశారు. ఇరాన్ పాలకులు, నేతలు, క్రిమినల్ గ్యాంగులనే టార్గెట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌లోని అరద్‌లో ఇరాన్ క్షిపణి దాడి చేసిన ప్రాంతాన్ని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం పరిశీలించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై మండిపడ్డారు.