నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు
` అది పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయి
` సుప్రీం ఆందోళన
` ఇంటి పనుల్లో భర్త కూడా సహాయపడాలి
` విడాకుల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ(జనంసాక్షి):మొబైల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలను ప్రజలు వెంటనే సోషల్ విÖడియాలో షేర్ చేసే ధోరణిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అలాంటి చర్యలు పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. నిందితుల వీడియోలు, ఫొటోలను పోలీసులు సోషల్ విÖడియాలో అప్‌లోడ్ చేసి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. ఒక కేసు విషయంలో పోలీసుల విÖడియా బ్రీఫింగ్‌పై మార్గదర్శకాలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే రాష్టాలను ఆదేశించింది. అందులో సోషల్ విÖడియాను కూడా చేర్చాలని పిటిషన్ కోరారు.ఈ పిల్‌పై జరిగిన విచారణలో భాగంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంకెళ్లు వేసిన, తాళ్లతో బంధించిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన నిందితుల ఫొటోలను పోలీసులు సోషల్ విÖడియాలో షేర్ చేయడం ఆ వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని, అది ప్రజల ఆలోచనను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. “నిబంధనల ద్వారా పోలీసులను నియంత్రించడానికి వీలు ఉంటుంది. కానీ సోషల్ విÖడియా, ప్రజల సంగతేంటి..? వారిని నియంత్రించగలమా..?” అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై విస్తత పరిశీలన అవసరం అని అభిప్రాయపడింది.
ఇంటి పనుల్లో భర్తా సహాయపడాలి
‘రోజులు మారాయి. దుస్తుల వాషింగ్ సహా ఇంటి, వంట పనులను, కుటుంబ బాధ్యతలను దంపతులిద్దరూ సమానంగా పంచుకోవాలి. గహ సంబంధమైన పనులను భార్య సరిగా చేయడంలేదని ఆరోపించడం సరికాదు. ఆ పనులన్నీ ఆమె చేయకపోవడాన్ని వేధింపులుగా పరిగణించలేం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహమాడింది జీవిత భాగస్వామినేనని, సేవకురాలిని కాదని గుర్తు చేసింది.దంపతులిద్దరూ ఉద్యోగులు. 2017లో వివాహమైంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె పుట్టింటిలోనే ఉండి పోయింది. 2019 నుంచీ ఆ దంపతులు విడిగా ఉంటున్నారు. ఇంటి, వంట పనులు సరిగా చేయకుండా తనను భార్య వేధిస్తుందని ఆరోపిస్తూ భర్త కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విడాకులు మంజూరయ్యాయి. ఈ తీర్పును భార్య హైకోర్టులో సవాల్ చేయడంతో విడాకులు రద్దయ్యాయి. భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించగా మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. అయినప్పటికీ ఫలితంలేకపోవడంతో భార్యాభర్తలు తమ ఎదుట హాజరుకావాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వారితో తాము నేరుగా మాట్లాడుతామని తెలిపింది. విచారణ ఏప్రిల్ 27వ తేదీకి వాయిదాపడింది.
ఈ పిల్ విచారణ నుంచి తప్పుకొంటున్నా: సీజేఐ
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తప్పుకొన్నారు. “ఈ కేసు నేను విచారిస్తే.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అందుకే వైదొలగుతున్నా” అని శుక్రవారం సీజేఐ తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల (నియామకం, సర్వీసు షరతులు, పదవీకాలం) చట్టం` 2023ను సవాల్ చేస్తూ పిల్‌లు దాఖలయ్యాయి. ఈ చట్టంలో ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తొలగించారు. దీన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. ప్రధాన న్యాయమూర్తి రేసులో లేని వారు ఈ పిటిషన్‌ను విచారిస్తే బాగుంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా సీజేఐ అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ అంశాన్ని మరో ధర్మాసనం వచ్చే నెల ఏడున విచారిస్తుందని సీజేఐ తెలిపారు.

