అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా

` నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ జాతికి అంకితం
` సిద్ధిపేటలోనూ కాంగ్రెస్ గెలవాల
` గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి
` ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం
` అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోండి
` సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్‌లోనూ నిర్మించాలి
` రైతుభరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
` పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం
` మొత్తం రూ.9వేల కోట్ల నిధుల విడుదల
` తొలి విడతగా రూ.3,590 కోట్లు అన్నదాతల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న ప్రభుత్వం
సిద్ధిపేట(జనంసాక్షి):ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేశారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన సభలో తొలి విడతగా రూ.3,590 కోట్లు విడుదల చేశారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం అన్నదాతల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో వెనుకంజ వేయడం లేదన్నారు. “వరికి బోనస్ ఇస్తున్నాం. వరదల వల్ల నష్టపోతే పరిహారం ఇస్తున్నాం. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు బాగా పండించేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల ఆ జిల్లాలో పంటల సాగు తగ్గింది. కూరగాయలు, పండ్లు ఇతర రాష్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం 50 లక్షల టన్నుల వరి మాత్రమే కొంటామని చెప్తోంది. పంటమార్పిడి ద్వారా మాత్రమే.. వ్యవసాయం లాభసాటి అవుతుంది. సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్‌లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకొని రైతులంతా ముందుకెళ్లాలి. తెలంగాణలో ఒక్కో జిల్లా.. ఒక్కో పంటకు ప్రసిద్ధి. రాష్ట్రంలో సారవంతమైన భూములున్నాయి.. కష్టపడే రైతులు ఉన్నారు. మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కషి చేస్తోంది. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని నిర్ణయించాం. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నాం. ఒకప్పుడు సౌరవిద్యుత్ వ్యాపారం అంబానీ, అదానీ వంటివారు చేసేవారు. ఈ ప్రభుత్వం మహిళలతో సోలార్‌ప్లాంట్లను ఏర్పాటు చేయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచే ఇంగ్లిష్ విÖడియం ప్రవేశపెట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు.. ఉదయం టిఫిన్ కూడా పెడుతున్నాం.పశ్చిమాసియాలో యుద్ధం వల్ల మనకు రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేలా ఉంది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా భాజపా ఎంపీలు సహకరించాలి. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేద్దాం. ఎన్నికలు లేనప్పుడు ప్రాంతాల అభివద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాలి. ప్రత్యర్థి పార్టీ నేతల గురించి ఆలోచిస్తే.. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్షచూపే సీఎంను కాదు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తా. గత పాలకులు విపక్షనేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. నేను నేతలతో వ్యతిరేకిస్తాను గానీ, ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని కొడంగల్‌కు తీసుకెళ్లేవాడిని. ప్రజలు బీఆరఎస్‌కు రెండుసార్లు అధికారం ఇచ్చారు.. మాకు రెండు సార్లు ఇస్తారు.” అని రేవంత్ అన్నారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 62 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. మరోవైపు రూ.80 కోట్లతో నర్మెటలో పామాయిల్ రిఫైనరీ ప్లాంట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా
హైదరాబాద్: రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం రూ.9వేల కోట్ల ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేశారు.అంతకు ముందు ఆయన ‘ఎక్స’లో రేవంత్ పోస్ట్ చేశారు. “అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెట వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు.. కేవలం 17 నెలల వ్యవధిలో పామాయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం” అని సీఎం పేర్కొన్నారు.

 

తెలంగాణ పునర్ నిర్మాణంలో ఆర్య వైశ్యులది కీలక పాత్ర ..
` వారు అభివద్ధిలో కీలక భాగస్వాములు
` ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్.. ఆర్య వైశ్యులు ఊరికి ఒక్కరు ఉన్నా ఆధిపత్యం చూపిస్తుంటారు.తెలంగాణ ఆర్ధిక అభివద్ధి లో భాగస్వాములు ఆర్య వైశ్యులు..ఆర్య వైశ్యులకు 6 మున్సిపల్ చైర్మన్ పదవులతోపాటు ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయం గా ప్రాధాన్యత కల్పించాం..రాజరికం లో అధికారం మారాలంటే హింస తప్పనిసరిగా ఉండేది.,కానీ మహాత్మా గాంధీ ఒక్కరే అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.. రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస,సహాయ నిరాకరణ,ఉప్పు సత్యాగ్రహం తో పారదోలిన గొప్ప తత్వవేత్త గాంధీ..దేశ అభివద్ధి లో ఆర్య వైశ్యులు భాగస్వాములు ..అవకాశాలు వచ్చినా రాకున్నా క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఓపిక తో ఉంటారు..నాకు ఇష్టమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య..ఆయన తో వాదించడం ,ప్రశ్నించడం గౌరవం గా ఉండేది..రోశయ్య విగ్రహం లక్డీకాపూల్ లో పెట్టి ఆయన స్ఫూర్తి ని కొనసాగిస్తున్నాం..టీ జీ వెంకటేష్ కూడా రాయలసీమ లో ఇతరులకు దీటుగా ఎదిరించి గెలిచి రాజకీయాలు చేస్తున్నారు..ఆర్య వైశ్యులకు సముచితమైన స్థానం కల్పిస్తాం ..విÖ ఆలోచన లే ప్రభుత్వం విధానం ..విÖ గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం ..గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించినందుకు అభినందనలు..