25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా
` పార్టీలో ఇక కొనసాగలేను: జీవన్‌రెడ్డి
` నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు,మార్గదర్శనం కావాలని కార్యకర్తలను కోరిన సీనియర్ కాంగ్రెస్ నేత
జగిత్యాల(జనంసాక్షి): కాంగ్రెస్‌లో కొనసాగలేనంటూ జగిత్యాల కార్యకర్తలకు సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని అందులో పేర్కొన్నారు. గత 20 నెలలుగా పార్టీలో మానసిక క్షోభకు గురవుతున్నానని తెలిపారు. అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనని చెప్పారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమై, అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని లేఖలో పేర్కొన్నారు. ‘నా రాజకీయ ప్రస్థానంలో విÖ తోడు, మార్గదర్శనం కావాలి’ అని కార్యకర్తలను కోరారు.


