దేశానికి ఏపీ ఆదర్శం
2014లో అధికారం మాదే
సీమాంధ్ర సభలో సీఎం
విజయవాడ, జూన్ 15 (జనంసాక్షి) :
దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శమని, 2014లోనూ తామే అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏడాదిలోరూ.16,500 కోట్లు రుణాల రూపంలో అందించా మని, ఈమొత్తం దేశంలో ఇచ్చిన రుణాల్లో సగం కంటే ఎక్కువని ప్రకటించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పులిగడ్డ`ఎనమలకుదురు కృష్ణా కరకట్ట రహదారిని సీఎం ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అబద్దాలతోనే కాలం గడుపడం అలవాటైందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను కడుగుకోవడానికే బాబు పాదయాత్ర చేశారని ఎద్దేవా చేశారు. ప్రేమలు ఒలుక పోయడం కాంగ్రెస్‌కుగాని తనకుగాని రాదని, ఇచ్చినమాటలను తు.చ తప్పకుండా అమలుచేయడమే మా ప్రత్యేకతన్నారు. నిత్యం అసత్యాలు చెపుతూ కాలం వెల్లదీయడం బాబుకు అలవాటై పోయిందన్నారు. చింతసచ్చినా పులుపు చావదన్న సామెత బాబుకు నూటికి నూరుశాతం వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో మరోసారి పాదయాత్ర చేసినా కూడా చంద్రబాబు అధికారంలోకి రాలేడన్నారు. చంద్రబాబు 9 ఏళ్లపాలన లో ఏఒక్కరోజు కూడా రైతు ప్రభుత్వంగా చెప్పుకోలేక పోయారంటే ఆయన చిత్తశుద్దిని ప్రజలే అర్థం చేసుకోగలరన్నారు. 2004`05లో వ్యవసాయానికి, అనుబంద సంస్థలకు కేవలం 900కోట్లు ఉండేదని, నేడు 5500కోట్లకు పెంచగలిగామన్నారు. ఉచితవిద్యుత్, పావలా వడ్డీపథకాలు అదనంగా ఉన్నాయన్నారు. వ్యవ సాయాన్ని వేరేగాచూపించిప్రత్యేక బడ్జెట్ పెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి ప్రధానమని, దీనిని సమకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. గతంలో 8,9వేల కోట్లుమాత్రమే రైతులకు బ్యాంకులనుంచి రుణాలిచ్చేవారని, నేడు ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే 72వేల కోట్లు ఒక్క సంవత్సరంలో ఇస్తున్నాయన్నారు. కేంద్రంలో సోనియా తీసుకున్న నిర్ణయం మేరకే ఇంతమొత్తం రుణాలు రైతులకు వస్తున్నా యన్నారు. ఇంతే కాకుండా సంవత్సరం లోపు రైతులు తీసుకున్న అప్పులను తిరిగిచెల్లిస్తే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అసలు కట్టండి చాలు, వడ్డీ అసలే వద్దు అని ప్రబుత్వం పెద్ద ఎత్తున నినాదంగా పనిచే స్తుందన్నారు. లక్ష రూపాయలలోపు అప్పులు తీసుకున్న రైతులు సుమారు 95 లక్షల మంది ఉన్నారన్నారు. వారందరికి వడ్డీ మినహాయింపు వర్తిస్తుందన్నారు. పంటలు పండాలంటే నీరు ప్రధానమని, వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో వర్షాలుతక్కువగా ఉన్నాఎక్కువగా దిగుబడి వచ్చిందంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. తక్కువగా నీరున్నాకూడా డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. రైతులకు ఇచ్చిన అప్పులను పూర్తిగా మాఫీచేస్తామంటూ చంద్రబాబు అసత్యాలు చెప్తు న్నాడని విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు. దేశంలో రైతులరుణాలు మాఫీచేయా లంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే సాద్యం అవు తుందన్నారు. తానుముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రకృతి వైఫరీత్యాలతో నష్టపోయిన రైతులకుఇస్తున్న పరిహారంహెక్టారుకు రూ. 4500నుంచి రూ.6 వేలకు పెంచినట్లు తెలిపారు. మహిళలకు పావలావడ్డీ, వడ్డీ లేనిరుణాల అందించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఈ శాసనసభ సమావేశాల్లో ‘బంగారుతల్లి’ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలను మార్చగలిగిన చట్టం ‘ఇందిరమ్మ కలలు’ మన రాష్ట్రంలో తప్ప ఇతర ఏరాష్ట్రం లోనూ అమలులో లేదని అన్నారు. సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.12,251 కోట్లుఖర్చు పెట్టామని ఆయన చెప్పారు. దేశంలోనే ‘బంగారు తల్లి’ పథకం రెండోపథకం అవుతుందని వివరించారు. రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్న ఘనతమన రాష్టాన్రిదేనన్నారు. రైతులు, మహిళలకు ప్రత్యేకంగా సంక్షేమపథకాలు అమలులోకి తెచ్చామని సీఎంపేర్కొన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బంగారుతల్లి పతకానికి చట్టబద్దతకల్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనచేశారు. ఆగష్టులోగా పులిచింత ప్రాజెక్టును పూర్తిచేసిదేశానికి, రైతులకు అంకితమిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేశామని సీఎం తెలిపారు. తెలుగుభాషను అబివృద్ధి చేయాలనే సంకల్పంతోనే మీ నియోజకవర్గానికి చెందిన బుద్ద ప్రసాద్‌ను నియమిస్తే తన అంచనాలకు మించి పనిచేస్తున్నాడన్నారు. ప్రపంచంలోనే మంచి గుర్తింపు తెచ్చేందుకు ఆయన చేస్తున్న కృషిఒక్క జిల్లాప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలను తలెత్తుకునేలా పనిచేస్తుందన్నారు. సిఎం పర్యటనలో బాగంగా ఇటీవలమృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విజయవాడకవిూషనర్ శ్రీనివాసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.