దేశాన్ని ఉత్తర,దక్షిణ దేశాలుగా చీల్చేందుకు కాంగ్రెస్‌ కుట్ర

` మా రాష్ట్రం..మా టాక్స్‌..మా వనరులు అంటే ఎలా!
` దేశంలో అస్థిరతను సృష్టించిందే కాంగ్రెస్‌ పార్టీ
` కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా
` దేశాభివృద్ధితోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం
` భారతరత్నను తమవాళ్లకే ఇచ్చుకున్న ఘనత వారిది
` గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత మాది
` రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోడీ
న్యూఢల్లీి(జనంసాక్షి):దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అవాస్తవ కథనాలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌వి కాలం చెల్లిన సిద్దాంతాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాని బుధవారం రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగంపై కొందరు అభిప్రాయాలు చెప్పారు. మరికొందరు విమర్శించారు. గతంలో నా ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. వారు నా మాటలు వినేందుకు సిద్ధంగా లేరని తెలుసు. విపక్షాల దుస్థితికి కాంగ్రెస్సే జవాబుదారీ. ఆ పార్టీవన్నీ పనికిరాని ఆలోచనలు. ఉత్తరం, దక్షిణం పేరుతో దేశాన్ని విడదీయాలని చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్‌ అంశాలను సైతం టచ్‌ చేస్తూ సంచలన కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్టాల్రపైనా మాట్లాడారు. దేశం గొప్పదనం ఢల్లీిలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉందన్న ఆయన.. తమకు అన్ని రాష్టాల్రు సమానమే అని పేర్కొన్నారు. కరోనా ముందు ప్రపంచం ఓడినప్పటికీ భారత్‌ గెలిచిందన్నారు. ఇందులో రాష్టాల్రు కీలక పాత్ర పోషించాయన్నారు. దేశం గొప్పదనం ఢల్లీిలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉందన్న ఆయన.. ఈ కారణంగానే జీ20 భేటీలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించామన్నారు. దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్టాల్రు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్టాల్రకు కావాల్సినన్ని నిధులు ఇస్తామని, ఫెడరలిజానికి తమ మద్దతు ఉంటుందన్నారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే పనిచేశానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. నిధులు రావడం లేదని ఢల్లీిలో ఒక రాష్ట్రం ధర్నాకు దిగడం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. తమకు రాష్టాల్రపై వివక్ష లేదన్నారు. దక్షిణ భారతం కావాలని ధర్నా చేస్తారా అని ప్రశ్నించారు. ’బొగ్గు తమ రాష్ట్రంలో ఉంది.. మేమే వాడుకుంటామంటే ఎలా నదులు మా రాష్ట్రంలో ఉన్నాయి మేమే వాడుకుంటామంటే కుదురుతుందా? మా రాష్ట్రం.. మా ట్యాక్స్‌ అంటారు.. ఇదక్కడి వితండవాదం. దేశం అంటే దేహం లాంటిది.. అన్ని ప్రాంతాలను సమానంగా చేస్తాం. రాష్టాల్ర హక్కులను అన్నిస్థాయిలో కాపాడుతాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మన దేశ భూభాగాల్లో చాలా వరకు కాంగ్రెస్‌ శత్రువులకు అప్పగించింది. మన సైన్యం ఆధునికీకరణను నిలిపివేసింది. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది. అలాంటి కాంగ్రెస్‌ జాతీయ భద్రత గురించి మాకు పాఠాలు చెబుతోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో వారి నాయకులు, విధానాలకే ఎలాంటి గ్యారంటీ లేదు. అలాంటి వారు మోదీ గ్యారంటీలను ప్రశ్నిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వారికి కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పనిచేసింది. మాజీ ప్రధాని నెహ్రూను వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. మా హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చాం. తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసింది ఎన్డీయే ప్రభుత్వం. కాంగ్రెస్‌ పాలకులు వారి కుటుంబీకులకు మాత్రమే అత్యున్నత పురస్కారాలను అందించారు. 1990లో కేంద్రంలో మా మద్దతుతో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ’భారతరత్న’తో సత్కరించిందని మోదీ గుర్తుచేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ నుంచి కాంగ్రెస్‌కు ఓ సవాల్‌ ఎదురైందని పరోక్షంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలను ప్రస్తావించారు. హస్తం పార్టీ 40 స్థానాలు కూడా సాధించలేదని అన్నారు.  కనీసం విూరు 40 సీట్లయినా గెలవాలని నేను కోరుకుంటున్నా అని ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఇటీవల ఖర్గే చేసిన ప్రసంగాన్ని కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో మాకు 400 సీట్ల మెజార్టీ వస్తుందని ఖర్గే అంచనా వేశారు. అది మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నా. కచ్చితంగా ఆయన అంచనా నిజమవుతుంది. ఆరోజు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా లభించిందని నేను ఆశ్చర్యపోయా. బహుశా ఆ రోజు వారి స్పెషల్‌ కమాండర్లు ఇద్దరు కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ను ఉద్దేశిస్తూ ఆ రోజు సభకు రాలేదేమో అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ పార్టీ పదే పదే ఒకే ఉత్పత్తి ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం మూతబడుతోంది. వారు తమ యువరాజును స్టార్టప్‌గా తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, ఆయన కనీసం దేన్నీ స్టార్ట్‌ చేయడు అని ఎద్దేవా చేశారు. రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా ఎందుకు విూరు మార్చలేదు? వార్‌ మెమేరియల్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ప్రాంతీయ భాషలపై ఎందుకు దృష్టి పెట్టలేదు? అని మోదీ ప్రశ్నించారు. కులగణన అంటూ కాంగ్రెస్‌ చేస్తున్న డిమాండ్‌పై మోదీ మాట్లాడుతూ, దళిత్‌`పిచ్చా`ఆదివాసీలకు కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకమేనని ఆరోపించారు. ఎలాంటి రిజర్వేషన్లను, ముఖ్యంగా ఉద్యోగాల్లో కోటాకు తాను వ్యతిరేకమని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అప్పటి ముఖ్యమంత్రులకు లేఖ రాసారని, ఈ వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే పని ప్రమాణాలు తగ్గిపోతాయని నెహ్రూ భావనగా ఉండేదన్నారు. ఒకప్పుడు వాళ్లే కాదనుకున్న ఈ డిమాండ్‌ను ఇప్పుడు వాళ్లే ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. శామ్‌ పిట్రోడాను ప్రధాని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ మార్గదర్శకులలో ఒకరు అమెరికాలో కూర్చుంటారని, ఇటీవల ఆయన రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్‌ అబేంద్కర్‌ పాత్రను తక్కువ చేస్తూ, నెహ్రూ చాలా కీలక పాత్ర పోషించారంటూ చెప్పారని అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి ఇంకెంతో దూరం లేదని ప్రధాని మోదీ అన్నారు. కొందరు దీనిని మోదీ 3.0 అని అంటున్నారని చెప్పారు. మోదీ 3.0లో వికసిత్‌ భారత్‌ను మరింత పటిష్టం చేస్తామని, రాబోయే ఐదేళ్లలో మెడికల్‌ కాలేజీలు పెరుగుతాయని, అనేక మంది డాక్టర్లు వస్తారని, చికిత్స ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. యోడీ ప్రసంగిస్తున్నంతసేపు అధికార పార్టీ ఎంపిలు బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేశారు.