దొడ్డి కొమురయ్య విగ్రహానికి విరాళం అందించిన.. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు
బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి 10111. రూపాయలు విరాళంగా అందించినట్లు బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజా డి బీరప్ప తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమికోసం. భుక్తి కోసం. తెలంగాణ ప్రజల కోసం రజాకారులతో పోరాటం చేసి అమరుడైన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు. రజాకారులతో పోరాటం చేసిన వ్యక్తి మన ప్రాంతం వాడు కావడం అందులో జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ఎంతో గర్వకారణం అని తెలంగాణ ప్రజలు ఆయన ఆశయాలను ధైర్య సాహసాలను మర్చిపోకుండా యువత ముందుకు సాగాలని భావితరాలకు ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పడం ఎంతో అవసరం ఉందన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి. సామాజిక సేవ కార్యకర్త బిజెపి రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి. నాగిరెడ్డిపల్లి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు ఉన్నారు