ద్వితీయ చెత్త సేకరణ కేంద్రాల ఏర్పాటు కు చర్యలు

– బల్దియా కమీషనర్ ప్రావీణ్య
-ఐ. సి.ఎల్.ఈ. ఐ. ప్రతినిధుల తో సమావేశం
వరంగల్ ఈస్ట్, జూలై 20(జనం సాక్షి):
 చెత్త సేకరణ కేంద్రాల ఏర్పాటు కు చర్యలు చేపట్టనున్నట్లు బల్దియా కమీషనర్ ప్రావీణ్య తెలిపారు.బుధవారం ప్రధాన కార్యాలయం లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్ (ఐ. సి.ఎల్.ఈ. ఐ)సౌత్ ఏషియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కమీషనర్ ఐ. సి.ఎల్.ఈ. ఐ సమర్పించిన ప్రతిపాదనలపై చర్చించారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ బల్దియా పరిధి లో ఇప్పటికే 2 ద్వితీయ ట్రాస్ఫర్ స్టేషన్ లు పనిచేస్తున్నాయని జిడబ్ల్యూ ఎంసీ నుండి  ప్రతిరోజు వెలుబడే చెత్త తరలింపు, వాహనాల ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రస్తుతం కొనసాగుతున్న ట్రాన్స్ఫర్ స్టేషన్ లకు తోడు మరో 4 ట్రాస్న్ ఫర్ స్టేషన్ ల ఏర్పాటుకు సర్వే నిర్వహించి నివేదిక సమర్పించిన నేపథ్యం లో బల్దియా పరిశీలించి మంజూరు అనంతరం ఫండింగ్ ఏజెన్సీ లకు పంపించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ. సి.ఎల్.ఈ. ఐ-సౌత్ ఏషియా రిప్రసెంటేటర్ సంస్కృతి,సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనురాధ, సి.ఎం.హెచ్.ఓ. డా.జ్ఞానేశ్వర్, ఎం.హెచ్.ఓ.డా.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.