ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడు.

 మార్పు కోసమే  ప్రజలు బిజెపి వైపు
* కరోనా నుండి ప్రజలను కాపాడిన నరేంద్ర మోడీ
* బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి
* బి ఆర్ ఎస్ కు సి ఆర్ ఎస్ కాయం
* ప్రజాస్వామ్య పార్టీ బిజెపి
* కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్
 నర్సాపూర్,  అక్టోబర్ , 9 ,   ( జనం  సాక్షి )
 తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రగాల్బాలు పలికి ,అమరుల త్యాగాలపై తెలంగాణను సాధించుకున్న తరువాత, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడని, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో బిజెపి పార్టీ లో చేరికల సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకుముఖ్య అతిథిగా కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండేదని కెసిఆర్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనతో విసుకేత్తిపోయారని, అందుకే మార్పు కోసం యావత్ తెలంగాణ ప్రజలు బిజెపిలో చేరుతున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రజాస్వామ్య పార్టీగా ఎదుగు తూ రామ మందిరం నిర్మాణం ఆర్టికల్ 370 ప్రవేశపెట్టి  దేశ సమగ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి కృషి చేస్తున్నాడని వారు అన్నారు తెలంగాణ ప్రజలు త్వరలోనే బి ఆర్ ఎస్ పార్టీకి సి ఆర్ ఎస్ ఇవ్వనున్నారని ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చూగ్ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేరికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాజీ మంత్రి బాబు మోహన్ నియోజకవర్గ ఇన్చార్జి గోపి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ రాజమణి యాదవ్ వాళ్దాస్ మల్లేష్ గౌడ్ రఘువీరారెడ్డి రాజేందర్ బుచ్చేష్ లతా రమేష్ యాదవ్ యాదవ్ కొత్త శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
 ఫోటో 2
2 Attachments • Scanned by Gmail