న’కల్’కలం..!
జమ్మికుంట, జనంసాక్షి: మార్చి 22 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఎలాగైనా మంచి స్థానాలు సాధించాలనే వ్యాపార కోణంలో పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వోపాధ్యాయులకు నజరానాలు ఇస్తూ తమ విద్యార్థులకు నకల్ చిట్టీలు అందజేయిస్తున్నారనే ఆరోపణలోస్తున్నాయి. అలాగే అబ్జెక్టివ్ టైప్ సమధాన పత్రాన్ని నింపిస్తున్నారనీ తెలుస్తోంది. ఈ క్రమంలో జమ్మికుంట పట్టణంలోని మూడు పరీక్షకేంద్రాల్లో ఇన్విజిలేటర్లు కొద్ది రోజులుగా అబ్జెక్టివ్ ప్రశ్న పత్రం లీక్ చేస్తున్నట్లు పట్టణ సీఐ దాసరి భూమయ్య గుర్తించారు. వీరందరినీ పిలిపించి, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ ఈ నెల 2న (మంగళవారం) వావిలాల కేంద్రానికి కొద్ది దూరంలో వెంక ప్రభాకర్ అనే ఇద్దరు ప్రభుత్వోపాధ్యాయులు భౌతికశాస్త్రం పేపర్‌లోని ప్రశ్నలకు జవాబులు రాసి వాటర్‌బాయ్ అభిషేక్ ద్వారా ఏడు గదుల్లోకి పంపిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు. ఈమేరకు ఈ ముగ్గురిపై కేసులు నమోదు కాగా, సీఐ విచారణ కొనసాగిస్తున్నారు.