నడిగడ్డలో ప్రజా సమస్యలపై పోరాడుతూ నూతన నాయకత్వం కొసం కృషి చేయాలి…

   -నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్
గొంగళ్ళ రంజిత్ కుమార్
గద్వాల రూరల్ ఆగష్టు 29 (జనంసాక్షి):-  నడిగడ్డలో ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే బహుజన నాయకత్వం రావాలని, రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు సంఘటితమై రాజకీయ చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నదని, నీతి,నిజాయితీ తొ పాటు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి గల నాయకత్వం  కోసం నడిగడ్డ హక్కుల పోరాట సమితి కృషి చేస్తుందని ఈ రోజు ప్రైవేట్ హోటల్లో జరిగిన రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు.నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి, సమస్యలపై ఏ రకంగా పోరాటాలు జరపాలో నిర్ణయించి, మా వర్గాలను రాజకీయ చైతన్యం చేస్తామని తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఒక కుటుంబ పాలనలో నలిగిపోయిందని బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగనీయకుండగా అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రజలకు ఓటు రాజకీయంతో రాజ్యాధికారం ఎ రకంగా సాధించాలో చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నదని, మన వర్గాలను చదువుకు,రాజ్యాధికారానికి ఉద్దేశ పూర్వకంగా దూరం చేశారని, అందుకే మన వర్గాలను మేల్కొలపాలని అన్నారు..రంగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, కార్యదర్శి లవన్న మండలాల నాయకులు విష్ణు తిమ్మప్ప,లక్ష్మన్న, చిన్న రాముడు, ప్రేమ్ రాజ్, ఉప్పరి కృష్ణ, గోవింద్ నెట్టెం పాడు గోపాల్, అవనీ శ్రీ, ఆలూరు వెంకట్రాములు,అంజి, గోవిందు, భీమన్న గౌడ్,అంజి, రమేశ్, రాము, పరుశరాముడు, చత్రపతి, భీమన్ గౌడ్ ,నాగర్ దొడ్డి కృష్ణ, ఉప్పరి కృష్ణ, హంపయ్య,యల్లేశ్ మరియు ఆయా గ్రామాల కమిటీ నాయకులు పాల్గొన్నారు.