నది పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్

ఇటిక్యాల జులై 19 (జనంసాక్షి) ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమతంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న పుష్కరఘాట్లను సందర్శించి, కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తుంగభద్రకు హోస్పెట్ డ్యాం, కృష్ణకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం ల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో నడిగడ్డ ప్రాంతంలో ఉన్న రెండు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. కృష్ణ, తుంగభద్ర నది తీరా గ్రామాలలోని ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ముందస్తు చర్యలలో భాగంగా ఇప్పటికే అన్ని గ్రామాలలో పోలీస్ సిబ్బంది, రెవిన్యూ అధికారులు సందర్శించి ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రధాన పుష్కర ఘాట్ల దగ్గర పోలీస్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, పంట పొలాలకు వెళ్లే వ్యవసాయ కూలీలు రైతులు నది ప్రవాహాన్ని చూసేందుకుగాని, ఫోటోలు దిగేందుకుగాని వెళ్లకుండ గ్రామ పోలీసులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నది పరివాహక గ్రామాలలో పెట్రోలింగ్ నిర్వహించి తగు జాగ్రత్త లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట ఇటిక్యాల ఎస్సై గోకారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు..