నమస్తే తెలంగాణ రిపోర్టర్‌పై దాడి
హుస్నాబాద్: మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ టౌన్ రిపోర్టర్ రమేష్‌పై స్థానిక ఎస్సై అనిల్‌కుమార్ దాడికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపు రాత్రి 11గంటల వరకు తెరిచి ఉంచడంతో ఇప్పటి వరకు ఎందుకు తెరిచి ఉంచారని రిపోర్టర్ రమేష్ అడుగగా లెక్కలున్నయంటూ చెప్పడంతో ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేయగా ఫోన్ లేపకపోవడంతో స్థానిక ఎస్సైకి ఫోన్ చేసి చెప్పగా నీవు ఎవడివిరా.. నాకు ఫోన్ చేసావంటూ దుర్భషలాడాడు. అంతే కాకుండా తనపై దాడికి పాల్పడి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. ఈ విషయమై స్థానిక రిపోర్టర్లు ధర్నా నిర్వహించి కేసీఆర్ వాహనాన్ని అడ్డుకుని జరిగిన సంఘటన గురించి వివరించారు. స్పందించిన కేసీఆర్ ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని హామి ఇచ్చారు. కాగా సిఐ తిరుపతి ఎస్సై చేసిన పొరపాటుకు తాను క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని హామి ఇవ్వడంతో ధర్నా విరమించారు.