*నర్కడలో ఉచిత వైద్య శిబిరం*

*200 మందికి ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా నర్కడ సర్పంచ్ సునిగంటి సిద్దులు ఆధ్వర్యంలో ఆస్ట్రా ప్రైమ్ హాస్పిటల్ సౌజన్యంతో శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కడలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన బుక్క వేణుగోపాల్, సర్పంచ్ సునిగంటి సిద్దులు. మీ వైపే సుబ్రంలో దాదాపు రెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
*ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ మాట్లాడుతూ* గ్రామాలలో ఉండే ప్రజలందరూ వ్యవసాయ పనులలో బిజీగా ఉండడం వల్ల ఆరోగ్యానికి పట్టించుకోరని, ఇట్టి సందర్భంగా గ్రామంలో ఉన్న స్త్రీ పురుషులకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య శిబిరంలో బిపి,షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి స్త్రీ వైద్య నిపుణులతో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామంలోని ఉన్నవారందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వారి కొరకు నిరంతరం కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ యాదవ్,గౌతి అశోక్, నగేష్ గౌడ్,బుక్క ప్రవీణ్, బుక్క కిట్టు,మహేష్, శివ ముదిరాజ్, శ్రీనివాస్, మల్లేష్, మోహన్ రావు,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : నర్కడలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకుంటున్న సర్పంచ్ సిద్దులు.
Attachments area