ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్‌కు సన్మానం

 

 

 

 

 

 

 

 

భీమదేవరపల్లి:ఆగస్టు26(జనం సాక్షి)మాదిగ సామాజిక వర్గానికి చెందిన కోమటిపల్లి గ్రామవాసి నమిండ్ల శంకర్ ఏసీపీగా పదోన్నతి పొందిన సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. శాలువా కప్పి, పూలమాల వేసి స్వీట్లు తినిపించారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తపనతో కష్టపడి చదివి సీఐగా పదోన్నతి పొంది, ఇప్పుడేమో ఏసీపీగా పదోన్నతి పొందడం ఆనందంగా ఉంది అన్నారు.
అంబేద్కర్ సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ శంకర్ యువతకు ఆదర్శం. కష్టపడి చదువుతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని నిరూపించారు.అని అభినందించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల ప్రకాష్, కండె రమేష్, కండె సుధాకర్, సాతూరు చంద్రమౌళి, టీచర్ శోభక్క, కరుణాకర్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.